IND vs AUS: వర్షంతో భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ వాష్ ఔట్? ఈరోజు విశాఖలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే..

|

Mar 19, 2023 | 11:03 AM

Visakhapatnam Weather Report: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో ఈరోజు (మార్చి 19) భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇది రెండో మ్యాచ్.

IND vs AUS: వర్షంతో భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ వాష్ ఔట్? ఈరోజు విశాఖలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే..
Ind Vs Aus 2nd Odi Vizag
Follow us on

IND vs AUS 2nd ODI Weather Report: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో ఈరోజు (మార్చి 19) భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇది రెండో మ్యాచ్. వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాబట్టి ఆస్ట్రేలియాకు ఇది ‘డూ ఆర్ డై’ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని కంగారూ జట్టు ప్రయత్నిస్తుంది. మరోవైపు చాలా కాలంగా స్వదేశంలో వన్డే సిరీస్‌ను టీమిండియా కోల్పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌ ఉత్కంఠకు వర్షం అడ్డంకిగా మారవచ్చని తెలుస్తోంది.

వాస్తవానికి, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంది. వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలోనూ అదే పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. కొంతమంది వాతావరణ శాస్త్రవేత్తలు మ్యాచ్‌కు ముందు వర్షం పడుతుందని అంచనా వేస్తుండగా, మరికొందరు శాస్త్రవేత్తలు మొదటి ఇన్నింగ్స్‌లో వర్షం పడుతుందని అంచనా వేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మ్యాచ్‌కు వర్షం అడ్డుపడే ఛాన్స్..

విశాఖపట్నం సహా ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు మేఘావృతమై వర్షం కూడా కురుస్తోంది. ఈరోజు రోజంతా మేఘావృతమై ఉంటుందని అంచనా. విశాఖపట్నంలో జరిగే మ్యాచ్‌లో ఉష్ణోగ్రత 26 నుంచి 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మధ్యాహ్నం 80% వర్షం పడే అవకాశం ఉంది. అక్కడ రాత్రిపూట కూడా 50% వర్షం కురిసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో, మ్యాచ్‌కు అడపాదడపా అడ్డుకునే ఛాన్స్ ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..