IND vs AUS Report: రెండో వన్డేలో చిత్తుగా ఓడిన ఆసీస్.. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్..

|

Sep 24, 2023 | 10:35 PM

IND vs AUS 2nd ODI Match Report: వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇది మాత్రమే కాదు, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత జట్టు తన అజేయ రికార్డును కొనసాగించింది.

IND vs AUS Report: రెండో వన్డేలో చిత్తుగా ఓడిన ఆసీస్.. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్..
Ind Vs Aus 2nd Odi
Follow us on

IND vs AUS 2nd ODI Match Report: వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇది మాత్రమే కాదు, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత జట్టు తన అజేయ రికార్డును కొనసాగించింది. ఈ గడ్డపై భారత జట్టుకు ఇది వరుసగా 7వ విజయం. ఇక్కడ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగులు చేసింది. 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియాకు 400 పరుగుల టార్గెట్..

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగులు చేసి కంగారూలకు 400 పరుగుల లక్ష్యాన్ని అందించింది.

ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు. అంతకుముందు 2013లో బెంగళూరులో భారత జట్టు 383 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (104 పరుగులు), శ్రేయాస్ అయ్యర్ (105 పరుగులు) సెంచరీ ఇన్నింగ్స్ ఆడగా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలతో రాణించారు.

ఆస్ట్రేలియా జట్టులో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్, సీన్ అబాట్, ఆడమ్ జంపాలకు ఒక్కో వికెట్ దక్కింది.

వర్షం కారణంగా మ్యాచ్‌‌కు రెండుసార్లు ఆటంకం..

సిరీస్‌లో రెండో మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా ప్రభావితమైంది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల మధ్య వర్షం కురిసింది. భారత ఇన్నింగ్స్‌లో తొలిసారి వర్షం కురిసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో, అంపైర్లు ఆస్ట్రేలియాకు సవరించిన లక్ష్యాన్ని ఇచ్చారు.

 ఇరుజట్ల ప్లేయింగ్ 11:

భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, మార్నస్ లాబుషాగ్నే, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..