నేడే భారత్-పాక్ ఆసియా కప్ ఫైనల్.. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే మ్యాచ్‌.. పాకిస్థాన్ ఆనుభవాన్ని టీమిండియా తిప్పికొట్టేనా..?

|

Jul 23, 2023 | 6:56 AM

IND A vs PAK A, Emerging Teams Asia Cup 2023 : సందర్భం ఏదైనా.. వేదిక ఎక్కడైనా భారత్, పాకిస్థాన్ మధ్య పోటీ అంటే ప్రపంచమే ఒక్కసారిగా ఆగి చూస్తుంది. అలాంటి మ్యాచ్‌‌లో ఈ రోజు భారత్, పాక్ మధ్యాహ్నం 2 గంటలకు తలపడబోతున్నాయి. అది కూడా టైటిల్ మ్యాచ్‌ అయితే ఇక దాని ముందు ఎలాంటి..

నేడే భారత్-పాక్ ఆసియా కప్ ఫైనల్.. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే మ్యాచ్‌.. పాకిస్థాన్ ఆనుభవాన్ని టీమిండియా తిప్పికొట్టేనా..?
IND A vs PAK A, Emerging Teams Asia Cup 2023
Follow us on

IND A vs PAK A, Emerging Teams Asia Cup 2023: సందర్భం ఏదైనా.. వేదిక ఎక్కడైనా భారత్, పాకిస్థాన్ మధ్య పోటీ అంటే ప్రపంచమే ఒక్కసారిగా ఆగి చూస్తుంది. అలాంటి మ్యాచ్‌‌లో ఈ రోజు భారత్, పాక్ మధ్యాహ్నం 2 గంటలకు తలపడబోతున్నాయి. అది కూడా టైటిల్ మ్యాచ్‌ అయితే ఇక దాని ముందు ఎలాంటి వినోదమైన దిగదుడుపే. అవును, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్ ఏ, పాకిస్థాన్ ఏ జట్లు తలపడబోతున్నాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో శ్రీలంక ఏ జట్టును పాక్ ఏ.. రెండో సెమీస్‌లో బంగ్లా ఏ టీమ్‌ని భారత్ ఏ ఓడించడం ద్వారా రెండూ ఫైనల్ చేరుకున్నాయి. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగే ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్‌కి కొలొంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదిక కానుంది.

అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ని ఓడించి 10 సంవత్సరాలుగా ఉన్న ‘ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ కరువును తీర్చుకోవాలని యష్ ధుల్ నేతృత్వంలోని టీమిండియా భావిస్తోంది. భారత్ ఏ చివరిసారిగా 2013లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టోర్నీ విజేతగా నిలిచింది. అప్పటినుంచి భారత్ ఖాతాలో ఆసియా కప్ టైటిల్ లేదు. విశేషం ఏమిటంటే.. 2013 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీలో పాక్‌పైనే భారత్ ఫైనల్ గెలిచి విజేతగా నిలిచింది. ఇంకా ఆ ఎడిషన్ తర్వాత మళ్లీ ఇప్పుడే భారత్ ఏ, పాక్ ఏ ఫైనల్‌లో తలపడుతున్నాయి. అలాగే భారత్, పాక్ జట్లు కూడా ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్‌లో పోటిపడబోతున్నాయి.

ఇవి కూడా చదవండి


కాగా, భారత జట్టుకు ఆండర్ 19 వరల్డ్ కప్‌ను అందించిన యష్ ధుల్ నాయకత్వంలో ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌ టైటిల్ కూడా టీమిండియా ఖాతాలో పడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో యువ భారత జట్టు బలంగా ఉంది. అయితే భారత జట్టులోని ఏ ఒక్క ప్లేయర్‌కి కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేదు కానీ పాకిస్థాన్ జట్టులోని కొందరికి ఉంది. పాక్ కెప్టెన్ మహ్మద్ హరీస్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ వసిమ్, అర్షద్ ఇక్బాల్ వంటివారికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. మరి ఈ క్రమంలో వారి అనుభవం భారత్‌ని అడ్డుకోగలుగుతుందా..? లేదా పాక్‌పై భారత్ పైచేయి సాధిస్తుందా తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే..

ఆసియా కప్ కోసం ఇరు జట్లు

భారత్-ఏ: సాయి సుదర్శన్, యశ్ ధుల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, నికిన్ జోస్, నిశాంత్ సింధు, రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, రాజ్‌వర్ధన్ హంగరేకర్, యువరాజ్ సింగ్ దోడియా, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), ఆకాశ్ సింగ్, నితీష్, ప్రదోష్ పాల్, ప్రదోష్ పాల్

పాకిస్థాన్-ఏ: మహ్మద్ హారీస్ (కెప్టెన్/వికెట్ కీపర్), సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఒమర్ యూసుఫ్, తాయెబ్ తాహిర్, ఖాసిమ్ అక్రమ్, ముబాసిర్ ఖాన్, అమద్ బట్, మహ్మద్ వసీం జూనియర్, సుఫియన్ ముకీమ్, అర్షద్ ఇక్బాల్, హసీబుల్లామ్ ఖాన్తా, హసీబుల్లామ్ ఖన్తా

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం