
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో ఆస్ట్రేలియా మాస్టర్స్ ఊహకందని ఊచకోత మొదలుపెట్టేశారు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లలోనూ ఘోర పరాజయాలు ఎదుర్కున్న ఆస్ట్రేలియా మాస్టర్స్.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలోనూ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. శుక్రవారం(మార్చి 7) సౌతాఫ్రికా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్కోర్ సాధించింది ఆస్ట్రేలియా మాస్టర్స్. 20 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి 260 పరుగులు చేసింది. కెప్టెన్ వాట్సాన్ 61 బంతుల్లోనే 9 సిక్సర్లు, 9 ఫోర్లతో 122 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతడికిది మూడో సెంచరీ.
ఇది చదవండి: 3 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు.. ఫైనల్‌లో టీమిండియాకు శనిలా దాపురించాడు.. ఎవరంటే.?
మరో బ్యాటర్ ఫెర్గ్యుసన్ 43 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా మాస్టర్స్ వరుసగా నాలుగో మ్యాచ్‌లో తమ జట్టు స్కోర్‌ను 200 దాటించారు. అటు ఆస్ట్రేలియా మాస్టర్స్ విధించిన 261 పరుగుల భారీ స్కోర్‌ను చేధించే క్రమంలో చతికిలబడింది సౌతాఫ్రికా మాస్టర్స్ జట్టు. కేవలం 123 పరుగులకే ఆలౌట్ అయ్యి.. 137 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో 55 ఏళ్ల జాంటీ రోడ్స్ అద్భుతమైన క్యాచ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో ఆస్ట్రేలియా మాస్టర్స్ కెప్టెన్ షేన్ వాట్సాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలు సాధించిన అతడు.. 4 మ్యాచ్‌ల్లో 33 ఫోర్లు, 25 సిక్సర్లతో మొత్తంగా 355 పరుగులు చేయడమే కాదు.. టోర్నమెంట్ అత్యధిక రన్ స్కోరర్‌గా మొదటి స్థానంలో నిలిచాడు.
ఇది చదవండి: టీమిండియాకి అన్నీ చెడు శకునములే.. ఫైనల్ ఓడితే కోట్లు పాయే.. ఎందుకంటే.?
ఇది చదవండి: దమ్మునోడురా మావా.! బీసీసీఐ ఛీ కొట్టి తరిమేసింది.. కట్ చేస్తే.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి