SRH తన్ని తరిమేసింది.. MI అక్కున చేర్చుకుంది.. కట్ చేస్తే.. 31 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.!

ఐపీఎల్ 2024 టోర్నీ ప్రారంభం కాకముందే.. ముంబై ఇండియన్స్‌ గట్టి రీ-సౌండ్ విక్టరీ సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన అంతర్జాతీయ టీ20 లీగ్ టైటిల్‌ విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌ను 45 పరుగుల తేడాతో ఓడించింది. ఇంతకీ అతడెవరో తెలుసుకుందామా..

SRH తన్ని తరిమేసింది.. MI అక్కున చేర్చుకుంది.. కట్ చేస్తే.. 31 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.!
Pooran

Updated on: Feb 19, 2024 | 1:49 PM

ఐపీఎల్ 2024 టోర్నీ ప్రారంభం కాకముందే.. ముంబై ఇండియన్స్‌ గట్టి రీ-సౌండ్ విక్టరీ సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన అంతర్జాతీయ టీ20 లీగ్ టైటిల్‌ విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌ను 45 పరుగుల తేడాతో ఓడించింది. ముంబై జట్టు కెప్టెన్ నికోలస్ పూరన్ ఫైనల్‌లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి.. ఆ జట్టుకు ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 17న ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత ఎంఐ బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోర్ సాధించింది. దుబాయ్ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై జట్టు ఓపెనర్లు వసీం(43), కుశల్ పెరేరా(38) వేగంగా పరుగులు రాబట్టగా.. వన్‌డౌన్‌లో దిగిన ఆండ్రీ ఫ్లెచర్(53), కెప్టెన్ పూరన్(57) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆ జట్టు భారీ స్కోర్ సాధించగలిగింది. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ నికోలస్ పూరన్ 27 బంతులు ఎదుర్కొని అజేయంగా 57 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతడి స్ట్రైక్ రేట్ 211గా ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో పూరన్ 2 ఫోర్లు, 6 సిక్సర్లు బాదేశాడు.

45 పరుగుల తేడాతో ఓడిన దుబాయ్ క్యాపిటల్స్..

ఫైనల్‌లో దుబాయ్ క్యాపిటల్స్‌కు 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది ముంబై ఎమిరేట్స్. అయితే 20 ఓవర్లు ముగిసేసరికి దుబాయ్ జట్టు 7 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ ఘన విజయం సాధించింది. దుబాయ్ జట్టులో టామ్ బంటన్(35), కెప్టెన్ బిల్లింగ్స్(40) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేయగలిగారు. మిగతా బ్యాటర్లు వెనువెంటనే పెవిలియన్ చేరారు. కాగా, ఐపీఎల్‌లో 2022లో నికోలస్ పూరన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు రూ. 10 కోట్లు పెట్టి పూరన్‌ను కొనుగోలు చేయగా.. పేలవ ఫామ్ కారణంగా గతేడాది వేలంలో SRH జట్టు అతడ్ని వదులుకుంది. ఇక ఐపీఎల్ 2023లో పూరన్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున అద్భుత ఆటతీరు కనబరిచాడు.