వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌లోకి ప్రవేశించాయి. ఇక శ్రీలంకపై విజయంతో న్యూజిలాండ్ జట్టు కూడా దాదాపు సెమీఫైనల్ ఆడటం ఖాయమైంది. కాగా శ్రీలంకపై న్యూజిలాండ్ జట్టు అద్భుత విజయం సాధించడంతో పాక్ జట్టు సెమీఫైనల్ ఆశలు అడుగంటిపోయాయి. ఎందుకంటే శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయి ఉంటే సెమీఫైనల్‌లోకి ప్రవేశించేందుకు పాకిస్థాన్‌కు మంచి అవకాశం లభించేది. అయితే ఇప్పుడా ఛాన్స్ ఏ మాత్రం లేదు. న్యూజిలాండ్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంకపై విజయంతో కివీస్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిన పాకిస్థాన్ జట్టు తన చివరి మ్యాచ్‌ని ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ గెలిస్తే సరిపోదు. తన నెట్ రన్ రేట్‌ను కూడా భారీగా పెంచుకోవాలి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టు నెట్ రన్ రేట్ +0.743. కానీ పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం +0.036 నెట్ రన్ రేట్ మాత్రమే కలిగి ఉంది. అంటే ఇంగ్లండ్‌పై గెలవడం ద్వారా పాకిస్థాన్ జట్టు తమ నెట్ రన్ రేట్ +0.744 పెంచుకోవాలి.
అంటే పాకిస్తాన్ సుమారు 287 పరుగుల తేడాతో విజయం నమోదు చేయాలి. అలాగే ఇంగ్లాండ్ ఇచ్చిన లక్ష్యాన్ని 16 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించాలి. అంటే ఈ లెక్కన పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే అన్నమాట. దీని ప్రకారం సెమీఫైనల్‌లో భారత్‌కు న్యూజిలాండ్ ప్రత్యర్థి కావడం దాదాపు ఖాయం. అలాగే మరో సెమీస్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
📸 🔙 in the nets getting game-ready 🏏#CWC23 | #DattKePakistani pic.twitter.com/DyVabkNHCJ
— Pakistan Cricket (@TheRealPCB) November 8, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..