World Cup 2023: బాల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ కప్ .. కుల్దీప్‌ మ్యాజిక్‌ బాల్‌ .. బిత్తరపోయిన బట్లర్‌.. వీడియో

కుల్‌ దీప్‌ యాదవ్‌ ఓ మ్యాజిక్‌ బాల్‌తో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ను బౌల్డ్‌ చేయడం మ్యాచ్ కే హైలెట్‌ అని చెప్పవచ్చు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో కుల్‌ దీప్‌ వేసిన బంతి ఏకంగా 7.2 డిగ్రీలు టర్న్‌ తిరిగింది. అయితే ఈ స్నేక్‌ బాల్‌ ను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు బట్లర్. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌లో పిచ్ అయిన బంతి అనూహ్యంగా టర్న్ అయి మిడిల్ స్టంప్‌ను లేపేయడంతో..

World Cup 2023: బాల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ కప్ .. కుల్దీప్‌ మ్యాజిక్‌ బాల్‌ .. బిత్తరపోయిన బట్లర్‌.. వీడియో
Kuldeep Yadav

Updated on: Oct 30, 2023 | 11:48 AM

వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆదివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఇది వరుసగా ఆరో విజయం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానం కైవసం చేసుకుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌ లో భారత్ ఇచ్చిన 229 పరుగులకు సమాధానంగా ఇంగ్లండ్ జట్టు 34.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా తరఫున మహ్మద్ షమీ 4, బుమ్రా 3, కుల్దీప్ 2, జడేజా ఒక వికెట్ తీశారు. అయితే  కుల్‌ దీప్‌ యాదవ్‌ ఓ మ్యాజిక్‌ బాల్‌తో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ను బౌల్డ్‌ చేయడం మ్యాచ్ కే హైలెట్‌ అని చెప్పవచ్చు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో కుల్‌ దీప్‌ వేసిన బంతి ఏకంగా 7.2 డిగ్రీలు టర్న్‌ తిరిగింది. అయితే ఈ స్నేక్‌ బాల్‌ ను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు బట్లర్. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌లో పిచ్ అయిన బంతి అనూహ్యంగా టర్న్ అయి మిడిల్ స్టంప్‌ను లేపేయడంతో బట్లర్‌ బిత్తర పోయాడు. బంతి పెద్దగా టర్న్‌ కాదనుకున్నాడేమో.. బ్యాక్‌ ఫుట్‌ షాట్‌ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సర్వత్రా వైరల్ అవుతోంది. నెటిజన్లు చైనామాన్ బౌలర్‌ వేసిన ఈ బంతిని బాల్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో భారత్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో తొలి వికెట్‌కు 30 పరుగులతో మెరుపు ఆరంభాన్ని అందించారు. అయితే ఆ జట్టు కేవలం 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ బట్లర్ వికెట్ల వేటను అడ్డుకున్నాడు. పెద్దగా పరుగులు తీయకున్నా క్రీజులో ఓపికిగా నిలబడ్డాడు. మొయిన్‌ అలీతో కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించడం ప్రారంభించాడు. అయితే కుల్‌ దీప్‌ వేసిన 16వ ఓవర్లో బట్లర్‌ కు పెద్ద షాక్‌ తగింది. ఆ ఓవర్‌ తొలి బంతికే బట్లర్‌ ను బోల్తా కొట్టించిన చైనామన్‌ భారత్‌ కు మరో బ్రేక్‌ ఇచ్చాడు. ఆఫ్ స్టంప్ వెలుపల బౌలింగ్ చేసిన బంతి పిచ్‌ను తాకి నేరుగా స్టంప్‌ వైపునకు దూసుకెళ్లింది. బంతి ఇంతలా టర్న్‌ అవుతుందని ఊహించని బట్లర్.. ఆ బంతి వికెట్లను పడగొట్టడం చూసి కాసేపు షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ 8 ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. బట్లర్‌తో పాటు లియామ్ లివింగ్‌స్టన్ (27)ను కుల్దీప్ ఎల్బీడబ్ల్యూ గా ఔట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టన్ 27 పరుగులతో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించగా, భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

కుల్ దీప్ స్నేక్ బాల్..

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..