
ప్రపంచ కప్-2023 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ జట్టు బుధవారం (నవంబర్ 1) దక్షిణాఫ్రికా జట్టుతో తలపడుతుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే కివీస్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కి కూడా ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. గాయంతో బాధపడుతున్న కేన్ విలియమ్సన్ అందుబాటులో లేకపోవడం న్యూజిలాండ్ కు పెద్ద ఎదురుదెబ్బేనని భావించ వచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ కివీస్‌కు చాల కీలకం. వరుసగా రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. సెమీస్ రేసు రసవత్తరంగా మారిన ఈ దశలో విలియమ్సన్ తప్పుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ‘దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ ఆడడం లేదు. కేన్ గత రెండు రోజుల్లో నెట్స్‌లో బాగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కానీ సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఆడలేడు. తదుపరి మ్యాచ్‌కి బరిలోకి దిగుతాడని ఆశిస్తున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. గత ఐపీఎల్ సమయంలో గాయపడిన కేన్ విలియమ్సన్ చాలా కాలం పాటు జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే కోలుకున్న కేన్ అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌పై 58 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. దీని తర్వాత మళ్లీ గాయంతో బాధపడుతున్న విలియమ్సన్.. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి రాలేదు. కానీ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఆడతాడని అంతా భావించారు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు.
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. టోర్నీలో ఆ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియా చేతుల్లో వరుసగా ఓడిపోయింది. కాబట్టి సెమీ-ఫైనల్ రేసులో నిలవాలంటే న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. ఆ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా, అందులో 4 మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లు సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే కివీస్‌కు ఇక్కడి నుంచి ప్రతి గేమ్‌ను గెలవడం తప్పనిసరి.
Kane Williamson has been ruled out of Wednesday’s match against @ProteasMenCSA.
Williamson has batted in the nets the last two days but has been ruled out of a return to match action tomorrow.
He will be assessed again ahead of the side’s next match against @TheRealPCB. #CWC23 pic.twitter.com/c8TIJRe7cT
— BLACKCAPS (@BLACKCAPS) October 31, 2023
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, ఇష్ సోధీ, మార్క్ చాప్‌మన్
క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగీ న్గిడి, తబ్రిజ్ షమ్సీ, రీజా హెండ్రిక్స్, కాగిలే రసోబాడా ఫెహ్లుక్వాయో, లిజాడ్ విలియమ్స్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..