ICC World Cup 2023: మా కోహ్లీనే ట్రోల్‌ చేస్తారా? ఇంగ్లండ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ తిక్క కుదిర్చిన భారత అభిమానులు

విరాట్ కు ఇంగ్లాండ్ పై మంచి రికార్డ్ ఉంది. దీంతో సహజంగానే విరాట్ పై భారీ అంచనాలు ఉంటాయి. అయితే అనుకోని షాట్ ఆడిన విరాట్ డేవిడ్ విల్లి వేసిన బంతిని మిడ్ ఆన్ మీదగా ఆడ బోయి బెన్ స్టోక్స్ కు చిక్కాడు. 9 బంతులు ఆడిన కోహ్లీ ఒక్క పరుగు చేయకుండానే డక్ అవుట్ అయ్యాడు.. ఇప్పుడు ఇదే వివాదానికి కారణం అవుతోంది.

ICC World Cup 2023: మా కోహ్లీనే ట్రోల్‌ చేస్తారా? ఇంగ్లండ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ తిక్క కుదిర్చిన భారత అభిమానులు
Ind Vs Eng Match

Edited By: Basha Shek

Updated on: Oct 30, 2023 | 12:18 PM

క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. ఇప్పటివరకు లీడ్ దశలో 6 మ్యాచ్ ల్లో ఒక్క టీం తోనే భరత్ ఓడిపోలేదు. దీంతో లీగ్ దశ నుండి సెమీఫైనల్స్ కు వెళ్లిన మొదటి టీమ్ గా నిలిచింది.. మొత్తం 6 దేశాలను ఓడించి భారత్ జైత్ర యాత్ర కొనసాగిస్తుంది.. ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఇంగ్లాండ్ టీమ్ లను లీగ్ దశ లో ఓడించింది..ఆదివారం రోజు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో భారత భారీ విజయం సాధించింది.. అయితే ఇంగ్లాండ్ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వివాదానికి తెర లేపుతున్నాయి. ఇంగ్లాండ్ మ్యాచ్ సందర్భంగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లకు 229/9 స్కోర్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 87(101) పరుగులు చేశాడు. ఓపెనర్ గిల్ తక్కువ పరుగులలే పెవిలియన్ బాట పడ్డాడు.13 బంతులు ఆడిన గిల్ 9 పరుగులు చేశాడు. ఆపై క్రిస్ వోక్స్ వేసిన బంతిని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తరువాత క్రేజ్ లో కి వచ్చాడు కింగ్ కోహ్లీ.. విరాట్ కు ఇంగ్లాండ్ పై మంచి రికార్డ్ ఉంది. దీంతో సహజంగానే విరాట్ పై భారీ అంచనాలు ఉంటాయి. అయితే అనుకోని షాట్ ఆడిన విరాట్ డేవిడ్ విల్లి వేసిన బంతిని మిడ్ ఆన్ మీదగా ఆడ బోయి బెన్ స్టోక్స్ కు చిక్కాడు. 9 బంతులు ఆడిన కోహ్లీ ఒక్క పరుగు చేయకుండానే డక్ అవుట్ అయ్యాడు.. ఇప్పుడు ఇదే వివాదానికి కారణం అవుతుంది. విరాట్ కోహ్లీ డక్ అవుట్ అవ్వగానే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీ స్టికర్ ను బాతు (duck) కు అతికించి “just out for a morning walk” అంటూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఈ పోస్ట్ చేసింది ఎవ్వరో కాదు “England’s barmy army” అఫీషియల్ పేజ్ లో ఈ పోస్టుని పబ్లిష్ చేశారు.

అయితే దీనికి దీటుగా సమాధానం ఇచ్చారు భారత్ ఆర్మీ సపోర్టర్లు. The barath army పేజ్ లో అదే డక్ బొమ్మ కు జాయీ రూట్ స్టికర్, బెన్ స్టోక్స్ స్టికర్ ను అతికించి పోస్ట్ చేశారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు. లివింగ్ స్టోన్ 27 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెన్ స్టోక్స్, రూట్ ఇద్దరు ఖాతా తెరువకుండానే పెవిలియన్ బాట పట్టారు. దీంతో just out for a evening walk .ఈ రెండు పోస్ట్ ల కింద భారీ గా ఇరు దేశాల అభిమానులు కామెంట్స్ చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

 బర్మీ ఆర్మీ పోస్ట్ ఇదే..

ఈవెనింగ్ వాక్ కు వచ్చారా ఏంటి?

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ పూర్తి మ్యాచ్ హైలెట్స్..

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..