World Cup 2023: జట్టులో ప్లేస్ దండగ అన్నారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అతడే ఆపద్భాందవుడయ్యాడు..

ICC World Cup 2023: ఆస్ట్రేలియా.. ఐదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ఈ జట్టు.. మెగా టోర్నమెంట్లు వస్తే.. తమ ఆటను పూర్తిగా మార్చేసుకుంటుంది. ప్రత్యర్ధులను బెంబేలెత్తించే పెర్ఫార్మన్స్‌తో అదరగొడుతుంది. అలాంటిది ఈ వన్డే ప్రపంచకప్‌నకు వచ్చేసరికి సీన్ కాస్తా రివర్స్ అయింది. పేలవమైన బ్యాటింగ్.. తేలిపోయిన బౌలింగ్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి.. కష్టాల్లో కూరుకుపోయింది.

World Cup 2023: జట్టులో ప్లేస్ దండగ అన్నారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అతడే ఆపద్భాందవుడయ్యాడు..
Australia Vs Srilanka

Updated on: Oct 16, 2023 | 8:15 PM

ఆస్ట్రేలియా.. ఐదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ఈ జట్టు.. మెగా టోర్నమెంట్లు వస్తే.. తమ ఆటను పూర్తిగా మార్చేసుకుంటుంది. ప్రత్యర్ధులను బెంబేలెత్తించే పెర్ఫార్మన్స్‌తో అదరగొడుతుంది. అలాంటిది ఈ వన్డే ప్రపంచకప్‌నకు వచ్చేసరికి సీన్ కాస్తా రివర్స్ అయింది. పేలవమైన బ్యాటింగ్.. తేలిపోయిన బౌలింగ్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి.. కష్టాల్లో కూరుకుపోయింది. అయితే ఇప్పుడు లక్నోలో శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో మాత్రం ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్‌లో ఆకట్టుకుందని చెప్పాలి.

పొదుపైన బౌలింగ్‌తో లంక జట్టును తక్కువ పరుగులకే పరిమితం చేయడమే కాకుండా.. వరుస ఇంటర్వెల్స్‌లో వికెట్లు తీసి ఆకట్టుకున్నారు ఆసీస్ బౌలర్లు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాడు. అలాగే ఆస్ట్రేలియా ప్రధాన స్పినంర్ ఆడమ్ జంపా సరైన సమయానికి వికెట్లు తీయడంతో.. ఆసీస్ తక్కువ స్కోర్‌కే లంకను పరిమితం చేయగలిగింది.

గత రెండు మ్యాచ్‌లలో స్పిన్నర్ జంపా ధారాళంగా పరుగులు సమర్పించడంతో.. అతడికి జట్టులో ప్లేస్ దండగ అన్నారు. అలాగే ఆస్ట్రేలియా టెస్ట్ స్పిన్నర్ అయిన నాథన్ లియాన్ కూడా తను బౌలింగ్ చేయడానికి సిద్దంగా ఉన్నానని.. చెప్పకనే చెప్పాడు. అటు ఇండియాలో ఐపీఎల్ ఆడిన అనుభవం జంపాకు ఉన్నప్పటికీ.. వికెట్లు తీయకపోవడంతో.. అతడు ఆసీస్ జట్టులో దండగ అని ముద్ర వేశారు. కానీ ఇప్పుడు అతడే ఆపద్భాందవుడయ్యాడు. మిడిల్ ఓవర్లలో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టి.. శ్రీలంక పతనంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌ 8 ఓవర్లు వేసిన జంపా.. ఒక మెయిడిన్‌తో 47 పరుగులకు 4 వికెట్లు తీశాడు. అటు జంపా దెబ్బకు లంకేయులు 209 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టులో నిస్సాంక(61), పెరెరా(78) ఇద్దరూ టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే.. ప్రపంచకప్‌లో పాయింట్ల ఖాతా తెరుస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్‌లు నెదర్లాండ్స్, పాకిస్తాన్‌తో ఆడబోతోంది.

వరల్డ్‌కప్ పాయింట్ల పట్టిక ఇలా ఉంది..

మరిన్ని వరల్డ్ కప్ 2023 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..