ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు 223 పరుగులకు ఆలౌటైంది. తొలి బంతికే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(0)డకౌట‌్‌గా ఔటవ్వడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. ఇక 6వ ఓవర్ల లోపే డేవిడ్ వార్నర్, హ్యాండ్స్ కాంబ్ సైతం అవుటవ్వడంతో స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లడం కోసం అలెక్స్ కేరీ(46), స్టీవ్ స్మిత్ (85) విశ్వ ప్రయత్నం చేశారు. మాక్స్‌వెల్ (22), మిచెల్ స్టార్క్ (29) సమయోచిత పోరాటం చేశారు. దీంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
ఇంగ్లాండ్ జట్టులో క్రిస్‌వోక్స్ (3/20), జోఫ్రా ఆర్చర్ (2/32), ఆదిల్ రషీద్ (3/54) రాణించారు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ కూడా దుర్భేద్యంగా ఉంది. ఇంగ్లాండ్ ఎలా ఎదురొడ్డి పోరాడుతుందో చూడాలి.