ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా సోఫియా గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ చెలరేగిపోయారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జేసన్ రాయ్ సెంచరీ, బెయిర్‌స్టో, బట్లర్‌ల అర్థశతకాలతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 386 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో రాయ్ 153, బట్లర్ 64, బెయిర్‌స్టో 51, మోర్గన్ 35 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో సైఫుద్దీన్, హసన్ చెరి రెండు, మోర్తజా, రహ్మన్ తలో వికెట్ తీశారు.