వరల్డ్ కప్ చరిత్రలో ఏడోసారి భారత్ చేతిలో ఓటమి పాలవడంతో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పై ఇంటాబయటా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీమిండియా బ్యాట్స్ మన్ రోహిత్ శర్మకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. పాక్ ఆటగాళ్లు ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు పొరుగుదేశం ఆటగాడిగా మీరెలాంటి సలహా ఇస్తారని ఓ మీడియా సంస్థ ప్రతినిధి ప్రశ్నించాడు. దానికి రోహిత్ శర్మ ఎంతో సమయస్ఫూర్తితో సమాధానమిచ్చాడు. “నేను పాకిస్థాన్ కోచ్ గా ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తానో అప్పుడు మీకు తప్పకుండా సమాచారం అందిస్తాను, ఎందుకంటే ఇది పాకిస్థాన్ కోచ్ జవాబు చెప్పాల్సిన ప్రశ్న, దీనికి నేనేం సమాధానం చెబుతాను?” అంటూ చమత్కరించాడు.