ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని భారత్‌లో క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు. ప్రత్యేక హోమాలు చేస్తూ భారత్ విజయాన్ని ఆకాంక్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో క్రికెట్ ఫ్యాన్స్ పూజలు చేశారు. గంగానదిలో పడవపై పూజలు చేశారు. అటు గోరఖ్‌పూర్‌లో కూడా హోమం నిర్వహించారు క్రికెట్ అభిమానులు. ఇవాళ ఆస్ట్రేలియాపై జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందని, ప్రపంచ కప్ కూడా భారత్ వశం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.