ICC Ranking: టీమిండియాకు మరో దెబ్బ.. అగ్రస్థానం పాయే.. ఏ స్థానంలో నిలిచిందంటే.!

|

Jan 20, 2022 | 1:58 PM

ICC Test Rankings: ఈ కొత్త సంవత్సరం టీమిండియా(Team India)కు కలిసొచ్చినట్లుగా అనిపించట్లేదు. మొదటిగా సఫారీల చేతుల్లో టెస్టుల్లో వరుస రెండు..

ICC Ranking: టీమిండియాకు మరో దెబ్బ.. అగ్రస్థానం పాయే.. ఏ స్థానంలో నిలిచిందంటే.!
Tests
Follow us on

ఈ కొత్త సంవత్సరం టీమిండియా(Team India)కు కలిసొచ్చినట్లుగా అనిపించట్లేదు. మొదటిగా సఫారీల చేతుల్లో టెస్టుల్లో వరుస రెండు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్ చేజార్చుకున్న భారత్.. ఆ తర్వాత తొలి వన్డేలో ఓటమితో మరో ఎదురుదెబ్బ ఎదుర్కుంది. ఇక ఇప్పుడు టెస్ట్ ర్యాంకింగ్‌(ICC Rankings)లో కూడా అగ్రస్థానాన్ని కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా(South Africa)లో టెస్ట్ సిరీస్ 2-1తో ఓటమి ఎదుర్కోవడంతో భారత్(116) జట్టు నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి మూడు స్థానానికి దిగజారింది.

Also Read: స్కూటీతో స్టంట్స్ చేయాలనుకుంది.. బెడిసికొట్టి బొక్కబోర్లా పడింది.. వైరల్ వీడియో మీకోసమే!

అటు యాషెస్ సిరీస్ విన్నర్‌గా నిలిచినా ఆస్ట్రేలియా 119 పాయింట్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. ఇక 117 పాయింట్లతో న్యూజిలాండ్ రెండ‌వ స్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్(116) మూడో స్థానంలో, ఇంగ్లాండ్(101), సౌతాఫ్రికా(99)లు నాలుగు, ఐదు స్థానాల్లో.. మిగిలిన వరుసలో పాకిస్థాన్(93), శ్రీలంక(83), వెస్టిండీస్(75), బంగ్లాదేశ్(53), జింబాబ్వే(31) జట్లు ఉన్నాయి.

Also Read: పారాసెటమాల్ టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!

మరోవైపు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(2021-23) టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌లో మూడు టెస్ట్ మ్యాచ్‌ల కోసం పర్యటించనుండగా.. శ్రీలంకతో భారత్ స్వదేశంలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే టెస్ట్ ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్ విషయానికొస్తే.. టీమిండియా(49.07 శాతం) మూడు ఓటములు, రెండు డ్రాలు, నాలుగు విజయాలతో ఐదో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా(86.66 శాతం) నాలుగు విజయాలు, ఒక డ్రాతో రెండో స్థానంలో ఉంది. ఇక శ్రీలంక రెండు మ్యాచ్‌లలో రెండు విజయాలు(100 శాతం) సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

Also Read: ఈ ఫోటో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. మీ కళ్లలో పదునున్నట్లే.!