AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20I Rankings: ఒక్క సెంచరీతో లెక్కలు మార్చేశాడు.. వైభవ్‌కు ఇచ్చిపడేసిన ఐపీఎల్ టీంమేట్..!

Vaibhav Sooryavanshi vs Lhuan dre Pretorius: తాజాగా విడుదలైన ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్ (ICC T20I Rankings) లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ రెండు స్థానాలు దిగజారి 49వ ర్యాంక్‌కు చేరాడు. ఇదే సమయంలో అతడి రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) సహచరుడు లువాన్-డ్రే ప్రిటోరియస్ ఏకంగా 61 స్థానాలు ఎగబాకి ఉమ్మడి 43వ ర్యాంక్‌కు చేరాడు. దక్షిణాఫ్రికా ట్రై-సిరీస్ ప్రదర్శన ప్రిటోరియస్‌కు భారీగా కలిసొచ్చింది.

ICC T20I Rankings: ఒక్క సెంచరీతో లెక్కలు మార్చేశాడు.. వైభవ్‌కు ఇచ్చిపడేసిన ఐపీఎల్ టీంమేట్..!
Vaibhav Sooryavanshi Vs Lhuan Dre Pretorius
Venkata Chari
|

Updated on: Sep 09, 2026 | 9:19 PM

Share

ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టీ20ఐ ర్యాకింగ్స్ లో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ లువాన్ డ్రే ప్రిటోరియస్ భారీగా దూసుకొచ్చాడు. ఇటీవల దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా మధ్య జరిగిన టీ20ఐ ట్రై సిరీస్‌లో అతడి తుఫాన్ బ్యాటింగ్‌కు మంచి ర్యాంకింగ్ ఫలితం దక్కింది. ఏకంగా 61 స్థానాలు ఎగబాకిన ప్రిటోరియస్ ఉమ్మడి 43వ ర్యాంక్కు చేరాడు. అదే సమయంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెండు స్థానాలు కోల్పోయి 49వ స్థానానికి పడిపోయాడు.

ట్రై సిరీస్‌లో శతకం..

దక్షిణాఫ్రికా ట్రై-సిరీస్ టైటిల్ గెలవడంలో ప్రిటోరియస్ కీలక పాత్ర పోషించాడు. మొత్తం 226 పరుగులు చేసిన అతడు 56.50 సగటుతో, 179.37 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. నమీబియాపై ఎదురైన ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా పుంజుకుని టైటిల్ సాధించడంలో అతడి బ్యాటింగ్ ముఖ్యంగా నిలిచింది.

ఎక్కువమంది చదివినది: Video: 20 ఏళ్ల తర్వాత తొలిసారి చెత్త రికార్గ్.. మరోసారి పాకిస్తాన్ ఇజ్జత్ పాయే.. అదేంటో తెలుసా?

ఇవి కూడా చదవండి

ఈ ప్రదర్శనతోనే అతడు తన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) టీంమేట్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ని ర్యాంకింగ్స్‌లో అధిగమించాడు. అయితే ప్రిటోరియస్ ప్రస్తుతం గ్రోయిన్ ఇంజ్యూరి (groin injury) నుంచి కోలుకుంటున్నాడు. త్వరలో జరిగే భారత్-అఫ్గానిస్థాన్ టీ20ఐ సిరీస్‌లో వైభవ్‌కు తిరిగి పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఎస్టర్‌హైజెన్‌కు కెరీర్ బెస్ట్..

దక్షిణాఫ్రికా బ్యాటర్ కానర్ ఎస్టర్‌హైజెన్ కూడా ర్యాకింగ్స్ లో గణనీయంగా ముందుకొచ్చాడు. ట్రై-సిరీస్‌లో 126 పరుగులు చేసిన అతడు 172.60 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. అందులో ఫైనల్లో 32 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఉంది.

ట్రై సిరీస్‌లోని ఆరో మ్యాచ్‌లో ఎస్టర్‌హైజెన్ కేవలం 40 బంతుల్లో 88 పరుగులు చేసి దక్షిణాఫ్రికా 228 పరుగుల భారీ స్కోరు సాధించడంలో సహకరించాడు. ఆ స్కోరును కాపాడుకుని ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న దక్షిణాఫ్రికా.. ఎస్టర్‌హైజెన్‌కు ర్యాంకింగ్స్‌లో 65 స్థానాల పురోగతిని అందించింది. అతడు కెరీర్ బెస్ట్ 627 రేటింగ్ పాయింట్లతో 25వ స్థానానికి చేరాడు.

ఆల్‌రౌండర్లలో ఎరాస్మస్, ఎవాన్స్..

నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ బ్యాట్‌తో 149 పరుగులు, బంతితో 5 వికెట్లు సాధించాడు. దీంతో టీ20ఐ ఆల్ రౌండర్స్ (T20I All Rounders) లో ఎనిమిదో ర్యాంక్ కు చేరాడు. బ్యాటర్ల జాబితాలోనూ 16 స్థానాలు ఎగబాకి 55వ స్థానంలో నిలిచాడు. లౌరెన్ స్టీన్‌క్యాంప్ 122 పరుగులతో ఉమ్మడి 73వ స్థానానికి చేరాడు.

ఎక్కువమంది చదివినది: Video: 16 ఫోర్లు, 12 సిక్సర్లతో బీభత్సం.. 37 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కంటే డేంజరస్‌‌గా ఉన్నాడేందయ్యా..!

జింబాబ్వే ఆల్‌రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ ట్రై సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ దక్షిణాఫ్రికాపై జింబాబ్వే తరపున నంబర్ 8 బ్యాటర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. దీంతో ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్ లో 14 స్థానాలు మెరుగై 25వ స్థానానికి, బౌలర్స్ జాబితాలో నాలుగు స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరాడు.

రజాకు అగ్రస్థానం..

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టీ20ఐ ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్ లో (T20I all-rounders Rankings)లో అగ్రస్థానాన్ని కొనసాగించాడు. రెండో స్థానంలోని సయీమ్ అయూబ్ కంటే 46 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. ట్రై-సిరీస్‌లో 3 వికెట్లు తీసిన రజా బౌలర్ల జాబితాలోనూ రెండు స్థానాలు మెరుగుపడి 27వ ర్యాంక్‌కు చేరాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సెంచరీతో వైభవ్‌కు ఇచ్చిపడేసిన ఐపీఎల్ టీంమేట్..!
సెంచరీతో వైభవ్‌కు ఇచ్చిపడేసిన ఐపీఎల్ టీంమేట్..!
అయ్యో పాపం.. బిగ్ బాస్ షాలినీ జీవితంలో ఇంతటి విషాదం ఉందా..?
అయ్యో పాపం.. బిగ్ బాస్ షాలినీ జీవితంలో ఇంతటి విషాదం ఉందా..?
వినాయకుడికి ఇష్టమైన పాలతాలికలపాయసం..ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలంటే
వినాయకుడికి ఇష్టమైన పాలతాలికలపాయసం..ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలంటే
రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్-వరంగల్ రూట్‌లో..
రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్-వరంగల్ రూట్‌లో..
క్రేన్లు, జేసీబీలు వచ్చినా కదలని హనుమాన్..!
క్రేన్లు, జేసీబీలు వచ్చినా కదలని హనుమాన్..!
అప్పుడు దాచుకున్న ఈ గింజలు.. ఇప్పుడు ఎంత మేలు చేస్తాయో తెలుసా..?
అప్పుడు దాచుకున్న ఈ గింజలు.. ఇప్పుడు ఎంత మేలు చేస్తాయో తెలుసా..?
ఓ ప్రేమ జంటకు దగ్గరుండి పెళ్లి చేశా.. కానీ ఆ హీరో గ్యాంగ్ వచ్చి..
ఓ ప్రేమ జంటకు దగ్గరుండి పెళ్లి చేశా.. కానీ ఆ హీరో గ్యాంగ్ వచ్చి..
ఫ్రాన్స్‌లో మన స్టార్టప్‌ల సత్తా.. భారత్ ఇన్నోవేట్స్ ప్రత్యేక..
ఫ్రాన్స్‌లో మన స్టార్టప్‌ల సత్తా.. భారత్ ఇన్నోవేట్స్ ప్రత్యేక..
ప్రపంచ క్రికెట్ లోనే పరమ వరస్ట్ టీం ఇదే..!
ప్రపంచ క్రికెట్ లోనే పరమ వరస్ట్ టీం ఇదే..!
నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?