AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం

ICC T20 Rankings : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ నంబర్-1, ఇషాన్ కిషన్ నంబర్-2 బ్యాటర్లుగా నిలిచారు. బౌలింగ్‌లో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా, వరుణ్ చక్రవర్తి రెండో స్థానంలో ఉన్నారు.

ICC T20 Rankings : ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న అభిషేక్ శర్మ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్ల వీరవిహారం
Abhishek Sharma
Rakesh
|

Updated on: Apr 02, 2026 | 8:25 AM

Share

ICC T20 Rankings : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా టీ20 ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ర్యాంకింగ్‌లలో భారత యువ ఆటగాళ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్నారు. వెటరన్లను పక్కకు నెట్టి కుర్రాళ్లు టాప్ ప్లేస్‌లో పాగా వేయడం భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకంగా మారింది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు అభిషేక్ శర్మ 875 పాయింట్లతో ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. అతని వెంటే ఇషాన్ కిషన్ 871 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరి ధాటికి పాకిస్థాన్, ఇంగ్లాండ్ బ్యాటర్లు వెనకబడిపోయారు. ఇక యువ కెరటం తిలక్ వర్మ 6వ స్థానంలో, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 7వ స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-10లో నలుగురు భారతీయులు ఉండటం విశేషం. సౌత్ ఆఫ్రికా యంగ్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ కూడా 10వ స్థానంతో టాప్-10లో ఎంట్రీ ఇచ్చాడు.

బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ మళ్ళీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే, భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 740 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకి రషీద్ కు గట్టి పోటీనిస్తున్నాడు. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా 5వ స్థానంలో స్థిరంగా ఉన్నాడు. పాకిస్థాన్‌కు చెందిన అబ్రార్ అహ్మద్ మూడో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ ప్రదర్శనలు ఈ ర్యాంకింగ్‌లపై ప్రభావం చూపుతుండటంతో భారత బౌలర్లు మెరుగైన స్థానాల్లో నిలుస్తున్నారు.

ఆల్ రౌండర్ల జాబితాను పరిశీలిస్తే, జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తన టాప్ ప్లేస్‌ను కాపాడుకున్నాడు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 299 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ యువ ఆటగాడు సైమ్ అయూబ్ మూడో స్థానంలో నిలవగా, నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ 4వ స్థానంలో ఉండి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ జాబితాలో అఫ్గాన్ ఆటగాళ్లు నబీ, ఒమర్జాయ్ కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ టీ20 బ్యాటింగ్ టాప్-10 జాబితా:

అభిషేక్ శర్మ (భారత్) – 875 పాయింట్లు

ఇషాన్ కిషన్ (భారత్) – 871 పాయింట్లు

సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) – 848 పాయింట్లు

ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) – 792 పాయింట్లు

పాతుమ్ నిస్సంక (శ్రీలంక) – 766 పాయింట్లు

తిలక్ వర్మ (భారత్) – 742 పాయింట్లు

సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 722 పాయింట్లు

జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) – 716 పాయింట్లు

టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్) – 712 పాయింట్లు

డెవాల్డ్ బ్రెవిస్ (దక్షిణాఫ్రికా) – 702 పాయింట్లు

ఐసీసీ టీ20 బౌలింగ్ టాప్-10 జాబితా:

రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) – 753 పాయింట్లు

వరుణ్ చక్రవర్తి (భారత్) – 740 పాయింట్లు

అబ్రార్ అహ్మద్ (పాకిస్థాన్) – 736 పాయింట్లు

ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్) – 721 పాయింట్లు

జస్ప్రీత్ బుమ్రా (భారత్) – 702 పాయింట్లు

ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) – 682 పాయింట్లు

కార్బిన్ బాష్ (దక్షిణాఫ్రికా) – 669 పాయింట్లు

మాథ్యూ ఫోర్డ్ (వెస్టిండీస్) – 667 పాయింట్లు

ముస్తాఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్) – 665 పాయింట్లు

ముజీబ్ ఉర్ రెహ్మాన్ (అఫ్గానిస్థాన్) – 663 పాయింట్లు

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us