World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రపంచ కప్ టిక్కెట్ల సేల్ ఎప్పుడు, ఎక్కడెక్కడో తెలుసా?

ODI World Cup 2023 Tickets: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, భారత క్రికెట్ నియంత్రణ మండలి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం షెడ్యూల్‌లో మార్పులు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం రీ షెడ్యూల్ చేసిన మ్యాచ్‌ల వివరాలను ప్రకటించింది. టిక్కెట్ విక్రయాలకు ముందు, అభిమానులు ఆగస్టు 15 నుంచి ICC క్రికెట్ ప్రపంచ కప్ వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చంటూ పేర్కొంది. ఇది టిక్కెట్‌లకు సంబంధించిన మొత్తం సమాచారం, అప్‌డేట్‌లను ముందుగానే స్వీకరించడానికి వారికి అనుమతిస్తుంది.

World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రపంచ కప్ టిక్కెట్ల సేల్ ఎప్పుడు, ఎక్కడెక్కడో తెలుసా?
World Cup 2023 Teams
Follow us
Venkata Chari

|

Updated on: Aug 09, 2023 | 8:35 PM

ODI World Cup 2023 Tickets: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం షెడ్యూల్‌లో మార్పులు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం రీ షెడ్యూల్ చేసిన మ్యాచ్‌ల వివరాలను ప్రకటించింది. ఆ తర్వాత మరో గుడ్ న్యూస్ కూడా అందించింది. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టికెట్ల సేల్ గురించి కూడా కీలక సమాచారం అందించింది. ఆగస్టు 25 నుంచి టిక్కెట్లను విక్రయించనున్నట్లు ప్రకటించింది.

టిక్కెట్ విక్రయాలకు ముందు, అభిమానులు ఆగస్టు 15 నుంచి ICC క్రికెట్ ప్రపంచ కప్ వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చంటూ పేర్కొంది. ఇది టిక్కెట్‌లకు సంబంధించిన మొత్తం సమాచారం, అప్‌డేట్‌లను ముందుగానే స్వీకరించడానికి వారికి అనుమతిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ తేదీల్లో దశల వారీగా టిక్కెట్లు అమ్మనున్నారు..

25 ఆగస్ట్ – నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లకు,

ఆగస్ట్ 30 – గౌహతి, త్రివేండ్రంలో భారత్ మ్యాచ్‌లకు,

ఆగస్ట్ 31 – చెన్నై, ఢిల్లీ, పూణేలో భారత్ మ్యాచ్‌లకు,

1 సెప్టెంబర్ – ధర్మశాల, లక్నో, ముంబైలో భారత్ మ్యాచ్‌లకు,

2 సెప్టెంబర్ – బెంగళూరు మరియు కోల్‌కతాలో భారత్ మ్యాచ్‌లకు,

3 సెప్టెంబర్ – అహ్మదాబాద్‌లో భారత్ మ్యాచ్‌లకు,

15 సెప్టెంబర్ – సెమీ ఫైనల్స్, ఫైనల్‌కు టిక్కెట్లను విక్రయించనున్నారు.

బీసీసీఐ సీఈవో హేమంగ్ అమిన్ మాట్లాడుతూ “ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం అధికారిక టిక్కెట్‌లపై సమాచారం, అప్‌డేట్లను స్వీకరించడానికి అభిమానులు నమోదు చేసుకోవచ్చని ప్రకటించడానికి మేం సంతోషిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు.

ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ మాట్లాడుతూ “ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 టిక్కెట్లు ఈ నెలలో అమ్ముడవుతాయి” అంటూ తెలిపారు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఐసీసీ 2023 వన్డే ప్రపంచకప్ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. రీ షెడ్యూల్‌లో 9 మ్యాచ్‌ల తేదీలు మార్చబడ్డాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఇప్పుడు అహ్మదాబాద్‌లో అక్టోబర్ 15కి బదులుగా అక్టోబర్ 14న జరగనుంది. అదే సమయంలో నవంబర్ 12న కోల్‌కతాలో జరగాల్సిన పాకిస్థాన్-ఇంగ్లండ్ మ్యాచ్ ఇప్పుడు నవంబర్ 11న జరగనుంది. నవంబర్ 11న నెదర్లాండ్స్‌తో గ్రూప్ దశలో టీమ్ ఇండియా తన చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, ఇప్పుడు నవంబర్ 12న బెంగళూరులో మ్యాచ్ జరగనుంది.

తాజా షెడ్యూల్‌లో పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌ల తలో 3 మ్యాచ్‌ల తేదీలు కూడా మారాయి. ఆస్ట్రేలియా, భారతదేశం రెండు మ్యాచ్‌లు రీషెడ్యూల్ చేశారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ కూడా ఒక్కో మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..