ICC ODI World Cup 2023 Schedule: ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో భారత్‌లో జరగనుంది. 2011 తర్వాత తొలిసారి వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే ఐసీసీ ఇప్పటి వరకు షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. ఈ ప్రపంచకప్ షెడ్యూల్ కోసం అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అందరిచూపు ప్రపంచకప్‌లో భారత్ -పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్‌పైనే ఉంది. తాజా నివేదికల మేరకు నేడు అంటే జూన్ 27, మంగళవారం ICC ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించవచ్చని తెలుస్తోంది.
ఈ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొద్దిరోజుల ముందుగానే ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి పంపింది. ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాలకు ముసాయిదా షెడ్యూల్‌ను కూడా పంపింది. దీని ప్రకారం, టోర్నమెంట్ అక్టోబర్ 5 న ప్రారంభమవుతుంది. ఫైనల్ నవంబర్ 19 న జరుగుతుంది. దీనికి ఇంకా ఐసీసీ ఆమోదం తెలపాల్సి ఉంది. మంగళవారం అవసరమైన మార్పులతో ICC ఈ షెడ్యూల్‌ను విడుదల చేయవచ్చని సమాచారం.
An out-of-this-world moment for the cricketing world as the #CWC23 trophy unveiled in space. Marks a milestone of being one of the first official sporting trophies to be sent to space. Indeed a galactic start for the ICC Men’s Cricket World Cup Trophy Tour in India. @BCCI @ICC… pic.twitter.com/wNZU6ByRI5
— Jay Shah (@JayShah) June 26, 2023
బీసీసీఐ ఐసీసీకి పంపిన షెడ్యూల్ కారణంగా పాకిస్థాన్‌కు కొన్ని మ్యాచ్‌ల సమస్య ఎదురైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించగా, ఆస్ట్రేలియాతో మ్యాచ్ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ బెంగళూరులో నిర్వహించాలని పాకిస్థాన్ కోరుతోంది. ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆడాలని కోరుతోంది.
ICC ODI World Cup 2023 Schedule |#IPL #odiworldcup2023 #iccworldcup #cricketnews #cricket pic.twitter.com/PAzMmBn8AU
— SeeCric (@SeeCric) June 14, 2023
అదే సమయంలో బీసీసీఐ ముసాయిదా షెడ్యూల్‌లో అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. దీనిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పాకిస్థాన్.. ఈ మ్యాచ్‌ను చెన్నై, కోల్‌కతాలో నిర్వహించాలని కోరింది. మరి ఇప్పుడు పాకిస్థాన్ డిమాండ్లు ఒప్పుకుందా లేదా తిరస్కరిస్తాయా అనేది చూడాల్సి ఉంది.
జూన్ 12న వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం, BCCI పంపిన ముసాయిదా షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడవచ్చు. టోర్నీలో మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న ప్రస్తుత విజేత ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగాలని ప్రతిపాదించారు. కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు సహా తొమ్మిది నగరాల్లో భారత్ తన లీగ్ మ్యాచ్‌లు ఆడవచ్చు.
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. వాటిలో ఎనిమిది జట్లు ఇప్పటికే తమ స్థానం కన్మ్‌ఫాం చేసుకోగా.. ప్రస్తుతం జరుగుతున్న క్వాలిఫైయర్ టోర్నమెంట్ ద్వారా రెండు జట్లు ఎంట్రీ ఇస్తాయి. ఇందులో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్, ఒక సారి ప్రపంచ ఛాంపియన్ శ్రీలంక కూడా పోటీపడుతున్నాయి.
ప్రపంచకప్‌నకు సంబంధించి, ఈ టోర్నీ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుందని, రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియం, ఈడెన్‌లో జరుగుతాయని సోమవారం కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల ఇక్కడ క్లిక్ చేయండి..