Indian Cricket Team: ప్రపంచ కప్ 2023 కోసం జట్ల పేర్లను ఖరారు చేయడానికి ఐసీసీ చివరి తేదీని ప్రకటించింది. ప్రపంచ కప్ 2023 కోసం అన్ని దేశాలు తమ ఆటగాళ్ల జాబితాను ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 మధ్య సమర్పించవచ్చని పేర్కొంది. వాస్తవానికి, ప్రపంచ కప్ 2023 కోసం జట్లు తమ ఆటగాళ్ల పేర్ల జాబితాను సెప్టెంబర్ 5 నాటికి ఐసీసీకి అందజేయాలి. అయితే అంతకు ముందు అన్ని జట్లు ఐసీసీ టెక్నికల్ టీమ్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుకు మాత్రం బ్యాడ్ న్యూస్‌గా మారింది.
ఈ గడువు తేదీలోగా ఐసీసీకి ఇచ్చే జాబితాలో రిషబ్ పంత్ పేరు ఉండటం దాదాపు అసాధ్యంగా మారింది. అయితే, ఇప్పుడు బీసీసీఐ, సెలక్టర్ల కళ్లు కేఎల్ రాహుల్ పైనే పడ్డాయి. అయితే గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ భారత అభిమానులకు శుభవార్తగా మారింది. ఆసియా కప్ నుంచి కేఎల్ రాహుల్ పునరాగమనం చేస్తాడని విశ్వసిస్తున్నారు. ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వార్తల ప్రకారం.. రిషబ్ పంత్ ప్రపంచకప్ వరకు ఫిట్‌గా ఉండడని దాదాపుగా తేలిపోయిందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
కేఎల్ రాహుల్ టెస్టు ఫార్మాట్‌లో టీమిండియాకు శాశ్వత వికెట్ కీపర్‌గా నిలిచాడు. అయితే ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఫిట్‌నెస్ బీసీసీఐ, సెలెక్టర్లకు ఇబ్బందిగా మారింది. అయితే, ఇప్పుడు కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ, సెలక్టర్లు ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఆసియా కప్ సందర్భంగా కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌ను నిశితంగా పరిశీలిస్తారని చెబుతున్నారు. ఆ తర్వాత ప్రపంచకప్‌నకు కేఎల్ రాహుల్ ఎంత ఫిట్‌గా ఉంటాడో తేల్చనున్నారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కసరత్తులు ప్రారంభించాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ నెట్స్ ప్రాక్టీస్ ప్రారంభించడం భారత అభిమానులకు శుభవార్త అందించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..