AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ త్రో తగలెయ్యా.. ప్రాణాలే పోయేవిగా.. ఐసీసీకే హార్ట్ ఎటాక్ తెప్పించిన ప్లేయర్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్

Kundai Matigimu Dangerous Throw, ZIM vs SA: జింబాబ్వే, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్ చేసిన పనికి ఐసీసీ కీలక చర్యలు తీసుకుని శిక్ష విధించింది. ఈ ఆటగాడికి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు.

నీ త్రో తగలెయ్యా.. ప్రాణాలే పోయేవిగా.. ఐసీసీకే హార్ట్ ఎటాక్ తెప్పించిన ప్లేయర్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
Kundai Matigimu Dangerous Throw
Venkata Chari
|

Updated on: Jul 09, 2025 | 6:38 AM

Share

Kundai Matigimu Dangerous Throw: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కొత్త రౌండ్‌లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశం-ఇంగ్లాండ్ సిరీస్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. కానీ, జింబాబ్వే వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సిరీస్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇందులో ట్రిపుల్ సెంచరీ కూడా చోటు చేసుకుంది. కానీ, ఈ మ్యాచ్‌లో భారీ ప్రమాదం తప్పింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ప్రాణాంతకమైన త్రోకు బలి అయ్యాడు. దీంతో ఐసీసీ దీనిపై కీలక చర్యలు తీసుకుంది. త్రో వేసిన ఫీల్డర్‌పై ఐసీసీ భారీ జరిమానా విధించింది.

బ్యాటర్‌కు తగిలిన బంతి..

జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ కుందాయ్ మాటిగిముకు ఐసీసీ జరిమానా విధించింది. రెండో టెస్ట్ సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్-1ని ఉల్లంఘించినందుకు అతను దోషిగా తేలాడు. దీని కారణంగా, మాటిగిముకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. ఈ మ్యాచ్ రెండు జట్ల మధ్య క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతోంది. ఆఫ్రికన్ బ్యాట్స్‌మన్ లుహాన్ డి ప్రిటోరియస్‌కు తొలి రోజు బంతి తగిలిన సంఘటన జరిగింది.

72వ ఓవర్లో..

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 72వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. మ్యాచ్ మొదటి రోజు, మాటిగిము తన ఫాలో-త్రూలో బంతిని ఫీల్డింగ్ చేసి బ్యాటర్ లువాన్-డి ప్రిటోరియస్ వైపు విసిరాడు. అది అతని మణికట్టుకు బలంగా తగిలింది. ఈ సంఘటన తర్వాత, మాటిగిము ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ని ఉల్లంఘించినట్లు తేలింది. ఇది ‘అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో ఆటగాడిపై లేదా సమీపంలో బంతిని (లేదా క్రికెట్ పరికరాలకు సంబంధించిన ఏదైనా ఇతర వస్తువు) అక్రమంగా/ప్రమాదకర రీతిలో విసిరేందుకు’ సంబంధించినది.

ఇవి కూడా చదవండి

థర్డ్ అంపైర్ పై ఫిర్యాదు..

ఈ ఆరోపణను ఫీల్డ్ అంపైర్లు, థర్డ్, ఫొర్త్ అంపైర్లు చేశారు. మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే ప్రతిపాదిత శిక్షను మాటిగిముకు విధించాడు. అందువల్ల, అధికారిక క్రమశిక్షణా విచారణ అవసరం లేదని తేలింది. ‘ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీల రంజన్ మదుగలే ప్రతిపాదితను మాటిగిము అంగీకరించడంతో, ఇక అధికారిక విచారణ అవసరం లేదని’ ఐసిసి తెలిపింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..