ICC Hall Of Fame: హాల్ ఆఫ్ ఫేమ్‌లో భాగమైన 26 మందితో కూడిన ఆటగాళ్ల సమగ్ర జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్, భారత మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, శ్రీలంక మాజీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ తదితరులు ఉన్నారు. అయితే, ఈ జాబితా విడుదలలో ఐసీసీ ఘోరమైన తప్పిదం చేసింది. ఈ తప్పిదాన్ని గుర్తించిన నెటిజన్లు ఐసీసీని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. ఇంతకీ ఆ తప్పు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హాల్ ఆఫ్ ఫేమ్ జాబితా విడుదల చేసిన ఐసీసీ.. సదరు క్రికెటర్ల ఘనతను వివరిస్తూ వీడియోను, గ్రాఫిక్ ఫోటోను విడుదల చేసింది. అయితే, తొలుత విడుదల చేసిన గ్రాఫిక్ ఫోటోలో వకార్ యూనిస్ భారతదేశం తరఫున ఆడినట్లు పేర్కొంది. ఇదే ఇప్పుడు తెగ రచ్చ అయ్యింది. వాస్తవానికి వకార్ యూనిస్ పాకిస్తాన్ తరఫున ఆడారు. అద్భుతమైన బౌలింగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతని గొప్పతనాన్ని గుర్తించి ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చింది. వకార్ యూనిస్ ప్రత్యేకతను చాటుతూ అతను ఆడిన క్రికెట్ మ్యాచ్‌లు, తీసుకున్న వికెట్ల వివరాలు అన్నీ వెల్లడిస్తూ ఒక గ్రాఫిక్ ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే, ఈ ఫోటో భారత్ తరఫున వకార్ యూనిస్ ఆడినట్లు పేర్కొని పెద్ద పొరపాటు చేసింది. ఐసిసి చేసిన పొరపాటును గుర్తించిన నెటిజన్లు ఐసిసిని ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. చివరికి జరిగిన పొరపాటును గుర్తించిన ఐసిసి ఆ గ్రాఫిక్ ఫోటోను మార్చింది.
Great work @ICC pic.twitter.com/PvnsQgdXeQ
— Dennis (@DennisCricket_) May 24, 2021
Also read: