AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మో అఫ్గనిస్థాన్!..అయినా పాక్ గెలిచింది

వరల్డ్ కప్‌లో తాజాగా జరుగుతోన్న మ్యాచ్‌లు మంచి మజా ఇస్తున్నాయి. సెమీస్ బెర్త్ కోసం టీమ్స్ తమ బలాబలాలు అన్నీ ఉపయోగించడంతో మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకు నువ్వా-నేవా అన్నట్టు సాగుతోన్నాయి.  చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మ్యాచ్ లో ఫైనల్ ఓవర్‌లో పాకిస్థాన్ నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 227 పరగులు చేయగా, పాకిస్థాన్ 228 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే అఫ్గనిస్థాన్ బౌలర్లు […]

అమ్మో అఫ్గనిస్థాన్!..అయినా పాక్ గెలిచింది
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2019 | 11:22 PM

Share

వరల్డ్ కప్‌లో తాజాగా జరుగుతోన్న మ్యాచ్‌లు మంచి మజా ఇస్తున్నాయి. సెమీస్ బెర్త్ కోసం టీమ్స్ తమ బలాబలాలు అన్నీ ఉపయోగించడంతో మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకు నువ్వా-నేవా అన్నట్టు సాగుతోన్నాయి.  చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మ్యాచ్ లో ఫైనల్ ఓవర్‌లో పాకిస్థాన్ నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 227 పరగులు చేయగా, పాకిస్థాన్ 228 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే అఫ్గనిస్థాన్ బౌలర్లు దడ పుట్టించగా పాకిస్థాన్ 7 వికెట్లు కోల్పోయి చివర్లో 49.4 ఓవర్ల వద్ద లక్ష్యం పూర్తి చేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే లక్ష్య ఛేదనలో మొదలు పెట్టిన పాకిస్థాన్ రెండో బంతికే ఓపెనర్ ఫకర్ జమాన్ డకౌటయ్యాడు. అనంతరం ఇమాముల్ హక్ (36), బాబర్ ఆజమ్(45) ఇద్దరూ స్కోరు బోర్డును నిలబెట్టే యత్నం చేశారు. దీంతో రెండో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం వెంట వెంటనే వికెట్లు పడటంతో పాకిస్థాన 156 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఒక దశలో ఓటమి అంచుల్లో నిలిచింది. కెప్టెన్ సర్ఫరాజ్ (18) సైతం రనౌట్‌గా పెవిలియన్ చేరడంతో జట్టు మరింత కష్టాల్లో కూరుకుంది. ఈ దశలో ఇమాద్ వసీం (49) చివరి వరకూ నాటౌట్ గా నిలిచి ఒత్తిడిలో జట్టుకు అండగా నిలవడంతో పాకిస్థాన్ ఎట్టకేలకు ఊపిరిపీల్చుకుంది. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ముజీబుర్ రహమాన్, మహ్మద్ నబీలు చెరో రెండు వికెట్లు పడగొట్టి పాక్ బ్యాట్స్ మెన్‌ను దెబ్బతీశారు .

బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..