AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటి కోహ్లి ఇది? ఇలా చేస్తే ఎలా మరి

వరల్డ్ కప్ 2019లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో 140 రన్స్‌తో రోహిత్ శర్మ భారత్ విజయంలో కిలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ కూడా అర్థ శతకాలతో సత్తా చాటారు. ముఖ్యంగా కోహ్లి 77 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 5 ఓవర్లలో వర్షం ఆగిపోయిన తర్వాత తిరిగి క్రీజులోకి వచ్చిన కాసేపటికే కొహ్లీ ఔట్ అయ్యాడు. అమీర్ బౌలింగ్‌లో కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి […]

ఏంటి కోహ్లి ఇది? ఇలా చేస్తే ఎలా మరి
Ram Naramaneni
|

Updated on: Jun 17, 2019 | 8:24 AM

Share

వరల్డ్ కప్ 2019లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో 140 రన్స్‌తో రోహిత్ శర్మ భారత్ విజయంలో కిలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ కూడా అర్థ శతకాలతో సత్తా చాటారు. ముఖ్యంగా కోహ్లి 77 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 5 ఓవర్లలో వర్షం ఆగిపోయిన తర్వాత తిరిగి క్రీజులోకి వచ్చిన కాసేపటికే కొహ్లీ ఔట్ అయ్యాడు. అమీర్ బౌలింగ్‌లో కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐతే పాక్ క్రికెటర్ల అప్పీల్‌కు అంపైర్ స్పందించలేదు. దాన్ని ఔట్‌గా ప్రకటించలేదు. కానీ కొహ్లీ మాత్రం క్రీజును వదిలి వెళ్లిపోయాడు. ఐతే రిప్లేలో అది నాటౌట్‌గా తేలింది. బంతి బ్యాట్‌ను తాకలేదని స్పష్టంగా కనిపించింది.

డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన తర్వాత రిప్లే చూసి కోహ్లి షాకయ్యాడు.  ఔట్ కాకుండానే అనవసరంగా వెనుదిరిగానన్న పశ్చాతాపం అతడిలో కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో బ్యాట్ హ్యాండిల్‌ను కోపంతో పదే పదే ఊపుతూ కనిపించాడు కొహ్లీ. ధోనీ సైతం అతడి బ్యాట్‌ను చూసి పరిశీలించాడు. ఐతే హ్యాండిల్ విరగడం వల్లే బంతిని తాకినట్లుగా సౌండ్ వచ్చిందని తెలిసింది. అందుకే అంపైర్ ప్రకటించకున్నా కొహ్లీ తనకు తానుగా వెనుదిరిగాడు.

కొహ్లీ చేసిన పనిని భారత క్రీడాభిమానులు తప్పుపడుతున్నారు. అసలే హై టెన్షన్ మ్యాచ్ కాబట్టి కాస్త సంయమనం పాటించి ఉండాల్సిందని అభిప్రాయపడుతోన్నారు.  చివరి రెండు ఓవర్లు కొహ్లీ క్రీజులో ఉంటే స్కోరు మరింత పెరిగేదని..భారత్ 350 పరగులు చేసి ఉండేదని సోషల్ మీడియాలో నెటిజన్లు తమ ఒపినియన్లు షేర్ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌తో తక్కువ ఇన్నింగ్స్‌లో 11వేల పరుగులు చేసిన ఆటగాడిగా కొహ్లీ రికార్డు సాధించాడు.

తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?
తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
సముద్రపు లోతుల్లోకి "ISRO' ప్రయాణం
సముద్రపు లోతుల్లోకి
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో