INDIA VS ENGLAND: భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌కు అంపైర్ల ఖరారు.. ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ.. వారెవరంటే..

INDIA VS ENGLAND: భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌కు అంపైర్లను బీసీసీఐ ఖరారు చేసింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో సభ్యులుగా ఉన్న ముగ్గురు భారత అంపైర్లను

INDIA VS ENGLAND: భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌కు అంపైర్ల ఖరారు.. ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ.. వారెవరంటే..

Updated on: Jan 30, 2021 | 5:28 AM

INDIA VS ENGLAND: భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌కు అంపైర్లను బీసీసీఐ ఖరారు చేసింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో సభ్యులుగా ఉన్న ముగ్గురు భారత అంపైర్లను టెస్టు సిరీస్‌కు అంపైర్లుగా ఖరారు చేసింది. కరోనా లాక్‌డౌన్ నిబంధనల కారణంగా న్యూట్రల్ అంపైర్లు అందుబాటులో లేకపోవడంతో ఆతిథ్య దేశానికి చెందిన ఐసీసీ అంపైర్లను వినియోగించుకోవడానికి ఐసీసీ అనుమతి ఇచ్చింది. దీంతో రాబోయే టెస్టు సిరీస్‌కు వీరేందర్ శర్మ, అనిల్ చౌధరి, నితిన్ మీనన్‌లను అంపైర్లుగా నియమించారు. నితిన్ మీనన్ గతంలో టెస్టు మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన అనుభవం ఉన్నది. అయితే అనిల్, వీరేందర్ లకు చెన్నైలో జరగనున్న టెస్టే తొలి మ్యాచ్ కానున్నది. ఈ ముగ్గురు గతంలో ఐపీఎల్‌లో అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.

Putins Palace: నల్ల సముద్రం ఒడ్డున పుతిన్‌కు రహస్య భవనం.. యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్న వీడియో.. 6 కోట్ల వ్యూస్..