Asia Cup 2022, Virat Kohli: విరాట్ కోహ్లీ గత వారం ఒక ఆంగ్ల వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మానసిక ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశాడు. ఒకప్పుడు తన పరిస్థితి జనంతో నిండిన గదిలోనూ ఒంటరిగా ఉండేదని చెప్పుకొచ్చాడు. అనంతరం 10 రోజుల తర్వాత తాజాగా మరోసారి తన మానసిక ఆరోగ్యం గురించి మరో ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తాను మానసికంగా బలహీనంగా ఉన్నానంటూ షాక్ ఇచ్చాడు.
ఆసియా కప్ 2022లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు, స్టార్ స్పోర్ట్స్‌తో విరాట్ సుదీర్ఘ సంభాషణలో మాట్లాడుతూ.. ‘నేను మానసికంగా బలహీనంగా ఉన్నానని అంగీకరించడానికి నేను సిగ్గు పడడం లేదు. అలా అనిపించడం చాలా సాధారణం. కానీ, మేం సిగ్గుతో దాని గురించి మాట్లాడకూడదనుకునేందుకు ప్రజలే కారణం. మమల్ని వారు అలా చూడకూడదనుకోవడం వల్లనే బహిరంగంగా చెప్పలేకపోతున్నాం. కానీ, నన్ను నమ్మండి. బలహీనంగా ఉన్నట్లు అంగీకరించడం కంటే బలంగా నటించడం దారుణమైన విషయం మరొకటి ఉండదు’ అంటూ పేర్కొన్నాడు.
కోహ్లి మాట్లాడుతూ, ‘నేను మానసికంగా చాలా బలమైనవాడిగా గుర్తించారు. నేను కూడా అలానే ఉన్నాను. కానీ, ప్రతి ఒక్కరికి ఒక పరిమితి ఉంటుంది. మీరు ఆ పరిమితిని గుర్తించాలి. లేకపోతే, మీ ఆరోగ్యానికి హాని జరగడం ప్రారంభమవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
It’s @imVkohli like you’ve never seen him before as he opens up to his fans in a special episode of Virat: Heart To Heart.
Catch it today at 5 PM on Star Sports & Disney+Hotstar.#KingKohli #TeamIndia | #AsiaCup2022 | #AsiaCup pic.twitter.com/3GaIJ24SKe
— Star Sports (@StarSportsIndia) August 27, 2022
’10 ఏళ్లలో తొలిసారి ఇలా..’
’10 ఏళ్లలో తొలిసారిగా నేను నెల రోజుల పాటు బ్యాట్ ముట్టుకోలేదు. నేను నా తప్పుడు శక్తిని చూపించడానికి ప్రయత్నిస్తున్నానని గ్రహించాను. ఎంతో ఉత్సాహంతో నాకు నేను భరోసా కూడా ఇచ్చుకున్నాను. కానీ, శరీరం మాత్రం సహాయం చేయలేదు. కాస్త విరామం తీసుకుని కాస్త వెనక్కి అడుగు వేయమని మనసు కోరింది’ అని తెలిపాడు.
చాలా కాలంగా ఫామ్‌లో లేని విరాట్ కోహ్లి.. తన ఆటతోనూ సత్తా చాటలేకపోయాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో అతను పరుగులు చేయలేకపోయాడు. సెంచరీ చేసి రెండున్నరేళ్లకు పైగా గడిచింది. జులైలో చివరిసారిగా ఇంగ్లండ్‌తో టెస్టు, వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక్కడ కూడా పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. దీని తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్‌లలో అతనికి విశ్రాంతి లభించింది. ఇప్పుడు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆగస్టు 28న మళ్లీ మైదానంలోకి రానున్నాడు. మరి ఈ మ్యాచ్‌తోనైనా పాత ఫాంలోకి వస్తాడేమో చూడాలి.