Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు అప్పుడే చెప్పా.. ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటావని..

|

Dec 12, 2021 | 9:08 AM

ఆల్‎రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతని అంతర్జాతీయ కెరీర్ ప్రమాదంలో పడింది. ఈ ఆల్‎రౌండర్ ఈ సంవత్సరం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు...

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు అప్పుడే చెప్పా.. ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటావని..
Pandya
Follow us on

ఆల్‎రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతని అంతర్జాతీయ కెరీర్ ప్రమాదంలో పడింది. ఈ ఆల్‎రౌండర్ ఈ సంవత్సరం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. టీ20 ప్రపంచ కప్ నుంచి భారత్ నిష్క్రమణ తర్వాత అతనిపై చాలా విమర్శలు వచ్చాయి. హార్దిక్ ఫిట్‌నెస్ సమస్యలను తాను ముందే చెప్పానని పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆకాషా చోప్రా యూట్యూబ్ ఛానెల్‎లో చెప్పాడు. 28 ఏళ్ల పాండ్యా వెన్ను సమస్యలకు సన్నటి శరీరాకృతి కారణమన్నాడు. “నేను దుబాయ్‌లో బుమ్రా, హార్దిక్ పాండ్యాతో కూడా చెప్పాను. వారు పక్షుల్లా సన్నగా ఉన్నారు. వారికి వెన్ను కండరాలు లేవు. ఇప్పుడు కూడా నా భుజాల వెనుక ఇంత మంచి బలమైన వెన్ను కండరాలు ఉన్నాయి” అని అక్తర్ చెప్పాడు. “నేను అతని (హార్దిక్) వీపును తాకాను, కండరాలు చాలా సన్నగా ఉన్నాయి. కాబట్టి అతను గాయపడతాడని నేను అతనిని హెచ్చరించాను. కానీ అతను చాలా క్రికెట్ ఆడుతున్నాడని చెప్పాడు.” అని అక్తర్ వివరించాడు.

“సరిగ్గా గంటన్నర తర్వాత, అతను గాయపడ్డాడు. 2018లో, పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్ చేస్తున్నప్పుడు స్ట్రెచర్ ఆఫ్ చేశాడు. అప్పటి నుంచి వెన్ను సమస్యలతో అతని కెరీర్ ఎక్కువగా ప్రభావితమైంది. ముంబై కోసం IPL 2021 సమయంలో అతను పూర్తిగా బ్యాటర్‌గా ప్రదర్శన ఇచ్చాడు.” అని అక్తర్ చెప్పాడు. కండరాలను పెంచుకోవాలని హార్దిక్‌కు తాను సలహా ఇచ్చానని అక్తర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచ కప్ జట్టులో హార్దిక్ చేరికను అభిమానులు, నిపుణులు చాలా మంది అతని ఫిట్‌నెస్ సమస్యలను ఎత్తిచూపారు. సూపర్ 12 దశలో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత మెన్ ఇన్ బ్లూ నాకౌట్‌లకు చేరుకోవడంలో విఫలమైంది.

Read Also.. Viral Video: “ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా” అంటున్న డేవిడ్ వార్నర్.. వైరల్‎గా మారిన వీడియో..