IPL 2023: చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోనే స్టార్ ప్లేయర్.. రూమర్లపై క్లారిటీ..

|

Feb 28, 2023 | 5:19 PM

Chennai Super Kings: ఐపీఎల్‌ 2023 సీజన్‌ త్వరలో మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌లు మొదలుపెట్టాయి. అయితే, ఈ క్రమంలో కొన్ని టీంలకు బ్యాడ్‌న్యూస్ వచ్చాయి. ఇందులో ముఖ్యంగా ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్..

IPL 2023: చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోనే స్టార్ ప్లేయర్.. రూమర్లపై క్లారిటీ..
Csk
Follow us on

ఐపీఎల్‌ 2023 సీజన్‌ త్వరలో మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌లు మొదలుపెట్టాయి. అయితే, ఈ క్రమంలో కొన్ని టీంలకు బ్యాడ్‌న్యూస్ వచ్చాయి. ఇందులో ముఖ్యంగా ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చివరి దశకు అందుబాటులో ఉండడనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ధోని టీంకు భారీ ఎదురుదెబ్బ తగులుతుందని అంతా అనుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంపై సీఎస్‌కే అత్యంత ఖరీదైన ప్లేయర్, ఇంగ్లండ్‌ టెస్ట్‌ సారథి బెన్‌ స్టోక్స్‌ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కివీస్‌తో టెస్ట్‌ సిరీస్ ఆడుతున్నాడు. కాగా, తొలి టెస్టులో గెలిచి, రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌ 2023 సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉంటానని, జరుగుతున్న ప్రచారం అవాస్తమని’ తెలిపాడు.

ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మోకాలి సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, మోకాలి గాయం బాధపెడుతున్నా.. నేను సీఎస్‌కేకు చివరి వరకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

వెల్లింగ్‌టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ అత్యుత్తమంగా బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. 31 ఏళ్ల అతను రెండో ఇన్నింగ్స్‌లో రెండు ఓవర్లకు మించి బౌలింగ్ చేయలేకపోయాడు. ఇంగ్లాండ్ 162.3 ఓవర్ల పాటు కష్టపడి కివీస్‌ను 483 పరుగులకు ఆలౌట్ చేసింది.

ఇంగ్లండ్ ఒక పరుగు తేడాతో ఓడిపోయిన తర్వాత స్టోక్స్ మాట్లాడుతూ, తన శరీర పరిస్థితి గురించి చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో మాట్లాడానని, రాబోయే కొద్ది వారాల్లో దాని కోసం ఫిట్‌గా ఉండటంపై దృష్టి సారిస్తానని వెల్లడించాడు.

“నేను ఐపిఎల్‌కి అందుబాటులో ఉంటాను. నేను ‘ఫ్లెమ్’తో మాట్లాడాను. నా శరీరంతో పరిస్థితి గురించి అతనికి పూర్తిగా తెలుసు. ప్రస్తుతానికి ఇది వారంలోపే సెట్ అవుతుందని ఆశిస్తున్నాను. నేను అబద్ధం చెప్పను, బయట జరుగుతున్న ప్రచారం చాలా నిరాశపరిచింది. ఫిజియోలు, వైద్యులతో కలిసి నేను గత 10 సంవత్సరాలుగా నా పాత్రను నెరవేర్చగల స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

“యాషెస్‌కు ముందు మరింత మెరుగ్గా ఉండేందుకు నాకు ఇప్పుడు నాలుగు నెలల సమయం ఉంది. ఎందుకంటే బర్మింగ్‌హామ్‌లో జరిగే మొదటి టెస్ట్‌కు నా పాత్రను సరిగ్గా నిర్వర్తించగలగాల్సి ఉంటుంది. నేను చేయగలిగినదంతా చేస్తాను. దాని గురించి చింతించకుండా ఉండటానికి ఉత్తమ అవకాశం’ అంటూ స్టోక్స్ ప్రకటించాడు.

ఐపీఎల్ 2023 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో స్టోక్స్ ఒకడు. లక్నో సూపర్‌జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన బిడ్డింగ్ వార్‌లో సీఎస్కే రూ.16.25 కోట్లతో దక్కించుకుంది. ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో భారీ బిడ్ దక్కించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..