IPL 2025: మరోసారి వైభవ్ దుమ్ములేపుడు.! ఈసారి ఇంగ్లాండ్‌లో ఒక్కో మ్యాచ్‌కు శాలరీ ఎంతంటే

ఐపీఎల్ 2025లో రాజస్తాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసి దుమ్ములేపాడు. ఇక ఆ తర్వాత అండర్ 19 జట్టులో చోటు సంపాదించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు అతడు ప్రతీ మ్యాచ్‌కు..

IPL 2025: మరోసారి వైభవ్ దుమ్ములేపుడు.! ఈసారి ఇంగ్లాండ్‌లో ఒక్కో మ్యాచ్‌కు శాలరీ ఎంతంటే
Vaibhav Suryavanshi

Updated on: May 26, 2025 | 8:08 PM

IPL 2025లో లీగ్ స్టేజిలోనే రాజస్థాన్ రాయల్స్ ఇంటికి చేరింది. అయితే 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పరుగుల సునామీ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో అతడు ఇంగ్లాండ్‌లో వన్డేలు ఆడేందుకు భారత అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు. జూన్ 24 నుంచి అండర్ 19 జట్టు ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభమవుతుంది. ఇందులో 5 యూత్ వన్డేలు, 2 మల్టీ-డే క్రికెట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఈ మ్యాచ్‌లకు వైభవ్ సూర్యవంశీకి ఎంత శాలరీ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..

IPL 2025లో వైభవ్ సూర్యవంశీ ఒక మ్యాచ్ ఆడినందుకు రూ. 7.5 లక్షలు శాలరీ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు అండర్-19 మ్యాచ్‌లకు బీసీసీఐ నుంచి ఎంత పొందుతాడంటే..! వైభవ్ సూర్యవంశీ ఇండియా-ఏ జట్టు ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకుంటే.. ప్రతి మ్యాచ్ ఆడినందుకు అతడికి రూ. 20 వేలు లభిస్తుంది. రిజర్వ్ ఆటగాళ్లలో ఉంటే ప్రతి మ్యాచ్‌కు రూ. 10 వేలు పొందుతాడు.

భారత U19 జట్టు షెడ్యూల్..

భారత అండర్-19 జట్టు పర్యటన జూన్ 24 నుంచి ప్రారంభమై జూలై 23 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ ఆడటమే కాకుండా, భారత అండర్-19 జట్టు 5 యూత్ వన్డేలు, 2 మల్టీ-డే మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడునుంది. టూర్ షెడ్యూల్ విషయానికొస్తే.. జూన్ 24న 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ ఉంటుంది. జూన్ 27 నుంచి జూలై 7 మధ్య 5 వన్డేలు జరుగుతాయి. మొదటి మల్టీ-డే మ్యాచ్ జూలై 12 నుంచి 15 వరకు.. రెండో 2 మల్టీ-డే మ్యాచ్‌ జూలై 20 నుంచి 23 వరకు ఉంటుంది.