పిల్లి హెయిర్ కట్ కు ఎంత ఖర్చవుతుంది? బిల్లు చూసి షాక్ అయిన వసీం అక్రమ్!

|

Nov 12, 2024 | 9:24 PM

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆస్ట్రేలియాలో తన పెంపుడు పిల్లికి హెయిర్ కట్ చేయించేందుకు వెళ్లగా 1000 ఆస్ట్రేలియన్ డాలర్ల (55,000 రూపాయలు) బిల్ చూసి షాక్ అయ్యాడట. అందులో $40 హెయిర్‌కట్ కోసం మాత్రమే, మిగతా డబ్బు వైద్య సేవలు, అనస్థీషియా కోసం ఖర్చయింది. ఈ సంఘటనపై వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పిల్లి హెయిర్ కట్ కు ఎంత ఖర్చవుతుంది? బిల్లు చూసి షాక్ అయిన వసీం అక్రమ్!
Vashim Akram
Follow us on

అబ్బా పిల్లి హెయిర్‌కట్‌కి ఇంత డబ్బా..? పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ నోటి నుంచి వచ్చిన మాట ఇది. పిల్లికి హెయిర్ కట్ ఏంటనీ ఆలోచిస్తున్నారా.. ఖర్చు ఎంత? అనేగా మీ సందేహం.. ఆ బిల్లు చూసే వసీం అక్రమ్ బిత్తరపోయాడట.

పాకిస్థాన్-ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా, కామెంటేటర్ గా చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లిన వసీం అక్రమ్.. అక్కడ తన పెంపుడు పిల్లికి హెయిర్ కట్ చేయించడానికి పెట్ సెలూన్‌కి వెళ్లాడు. పిల్లి జుట్టు కత్తిరించేందుకు 1000 ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు 55 వేల రూపాయలు) తీసుకున్నారట. దీంతో బిల్లు చూసి స్పృహ తప్పినంత పని అయిందంట వసీం అక్రమ్ కి.

ఈ సంఘటన గురించి వసీం అక్రమ్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కు కామెంటేటర్ గా పనిచేస్తున్న ఈ స్వింగ్ సుల్తాన్ మ్యాచ్ మధ్యలో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. “నేను నిన్న పిల్లిని హెయిర్ కట్ కోసం వెళ్లాను.. అతను పిల్లిని పడుకోబెట్టి, కూర్చోబెట్టి, తినిపించి ఏదో ఏదో చేసి వెయ్యి ఆస్ట్రేలియన్ డాలర్లు తీసుకున్నాడని.. ఆ బిల్లును చూసి ఆ డబ్బుతో పాకిస్థాన్ లో 200 పిల్లులకు హెయిర్ కట్ చేయించవచ్చని వారికి చెప్పానన్నాడు.

వాస్తవానికి ఆ బిల్లులో హెయిర్‌కట్ కోసం $40 వేశారు, కానీ మిగిలిన డబ్బు ఇతర సేవల కోసం నమోదు చేయబడింది. వైద్య పరీక్షల కోసం 104 డాలర్లు, అనస్థీషియా కోసం 304 డాలర్లు, ఇలా సెలూన్‌లో వసీం అక్రమ్ జేబును లూటీ చేశారట.

ఇక ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో పాకిస్థాన్‌ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. నెల రోజుల క్రితమే ఇంగ్లండ్‌తో ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ జట్టు ఓడిపోయి అప్పటి నుంచి ఆ జట్టు మంచి జోరుమీదుంది. మాజీ కెప్టెన్ బాబర్ అజామ్, టెస్టు జట్టుకు దూరమైన స్టార్ ఆటగాళ్లు, పేసర్లుగా షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షాలు తిరిగి జట్టులోకి వచ్చి రాణిస్తున్నారు.