AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Ratings: ఐసీసీ ర్యాంకింగ్స్ వెనుక అసలు రహస్యం.. పాయింట్లు ఎలా ఇస్తారు? ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటి?

ICC Ratings: ఐసీసీ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో ఆటగాళ్లకు పాయింట్లు ఎలా కేటాయిస్తారు? బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్ల ప్రదర్శనతో పాటు ప్రత్యర్థి బలం, మ్యాచ్ పరిస్థితులు, పిచ్ తీవ్రత, ఇటీవల ఫామ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 0 నుంచి 1000 పాయింట్ల స్కేల్‌పై రేటింగ్ ఇస్తూ, మ్యాచ్‌పై ఆటగాడి ప్రభావానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.

ICC Ratings: ఐసీసీ ర్యాంకింగ్స్ వెనుక అసలు రహస్యం.. పాయింట్లు ఎలా ఇస్తారు? ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటి?
Icc Rankings
Rakesh
|

Updated on: Sep 02, 2026 | 8:18 PM

Share

ICC Ratings: ప్రతి వారం ఐసీసీ విడుదల చేసే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో ఆటగాళ్ల స్థానాలు తలకిందులవ్వడం చూస్తూనే ఉంటాం. తాజాగా బుమ్రా మూడో స్థానానికి పడిపోగా ఒలీ రాబిన్సన్ టాప్-5లోకి దూసుకొచ్చాడు. అసలు ఈ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ ఎలా లెక్కిస్తుందో, దీని వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రతివారం మహిళలు, పురుషుల క్రికెట్ విభాగాల్లో టీమ్‌లతో పాటు ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తూనే ఉంటుంది. సాధారణంగా మహిళల ర్యాంకింగ్స్ మంగళవారం, పురుషుల జాబితా బుధవారం విడుదలవుతాయి. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్‌లలో బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలించి ఈ ర్యాంకులను కేటాయిస్తారు. జీవితకాల రికార్డుల కంటే కూడా ఆటగాళ్లు ఇటీవల కాలంలో కనబరిచిన ఫామ్‌కే ఐసీసీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.

ర్యాంకింగ్స్ జాబితాలో ఎవరు ఉంటారు?

ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతీ ఆటగాడు నిర్ణీత సమయంలో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడి ఉండాలి. టెస్టులకు 12 నుంచి 15 నెలలు, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు 9 నుంచి 12 నెలల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకవేళ ఆటగాడు గాయం వల్ల లేదా జట్టులో చోటు దక్కక సుదీర్ఘకాలం మ్యాచ్‌లు ఆడకపోతే అతడి పేరును ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. ఉదాహరణకు 2008లో పార్థివ్ పటేల్ జట్టుకు దూరమైనప్పుడు 2009లో అతడి పేరును తొలగించారు. తిరిగి 2016లో పునరాగమనం చేసినప్పుడు పాత రేటింగ్‌తో మళ్లీ జాబితాలోకి చేర్చారు. అలాగే రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్లను ఆయా ఫార్మాట్ల నుంచి మినహాయిస్తారు.

రేటింగ్ పాయింట్లు ఇచ్చే ప్రత్యేక ఆల్గారిథమ్

ర్యాంకింగ్స్ నిర్ణయించడానికి ఐసీసీ ఒక సంక్లిష్టమైన ఆల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది. 0 నుంచి 1000 పాయింట్ల స్కేలుపై ఆటగాళ్లకు రేటింగ్ ఇస్తారు. ఏ ఆటగాడైనా 900 పాయింట్లు దాటితే దాన్ని అత్యంత అరుదైన ఘనతగా భావిస్తారు. సాధారణంగా 750 పాయింట్లు సాధించిన వారు టాప్-10లో చోటు దక్కించుకుంటారు. 500 పాయింట్లకు పైన ఉంటే మంచి ప్రదర్శనగా పరిగణిస్తారు. కేవలం పరుగులు, వికెట్లు మాత్రమే కాకుండా మ్యాచ్ పరిస్థితి, ప్రత్యర్థి జట్టు బలం, పిచ్ తీవ్రతను బట్టి పాయింట్లు మారుతుంటాయి.

మ్యాచ్‌పై చూపిన ప్రభావమే కీలకం

ఒక బ్యాటర్ చేసిన పరుగులు లేదా బౌలర్ తీసిన వికెట్లు ఆ మ్యాచ్ ఫలితాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేశాయనేది చాలా ముఖ్యం. కష్టమైన పరిస్థితుల్లో, బలమైన బౌలింగ్ దాడిపై చేసిన 50 పరుగులు.. తేలికపాటి పిచ్‌పై చేసే సెంచరీ కంటే ఎక్కువ రేటింగ్ పాయింట్లను తెచ్చిపెడతాయి. అలాగే ప్రత్యర్థి జట్టులోని ప్రధాన బ్యాటర్ల వికెట్లు తీస్తే బౌలర్‌కు లభించే రేటింగ్ పాయింట్లు భారీగా పెరుగుతాయి. ఇలా మ్యాచ్ తీవ్రతను బట్టి లెక్కలు వేస్తూ ఐసీసీ పాయింట్లను కేటాయిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us