Hotel Rates-WC 2023: క్రికెట్ కార్నివల్ ఎఫెక్ట్..! భారీగా పెరిగిపోయిన హోటల్ రూమ్ ధరలు.. ఒక్క రోజుకు ఎంతంటే..?

|

Jun 28, 2023 | 5:46 PM

Hotel Tariffs-World Cup 2023: భారత్ వేదికగా జరిగే ఐసీసీ వరల్డ్‌ కప్‌‌ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అంటే దాదాపుగా 100 రోజుల సమయం ఉంది. అయితే టోర్నీలో ఒక్క బంతి కూడా వేయకుండానే హోటల్స్ స్కోర్ చేసుకోవడం..

Hotel Rates-WC 2023: క్రికెట్ కార్నివల్ ఎఫెక్ట్..! భారీగా పెరిగిపోయిన హోటల్ రూమ్ ధరలు.. ఒక్క రోజుకు ఎంతంటే..?
Hotel Rates increased ahead of WC 2023
Follow us on

Hotel Tariffs-World Cup 2023: భారత్ వేదికగా జరిగే ఐసీసీ వరల్డ్‌ కప్‌‌ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అంటే దాదాపుగా 100 రోజుల సమయం ఉంది. అయితే టోర్నీలో ఒక్క బంతి కూడా వేయకుండానే హోటల్స్ స్కోర్ చేసుకోవడం ప్రారంభించాయి. అవును, టోర్నీ తొలి మ్యాచ్‌, ఫైనల్ పోరు, భారత్-పాక్ పోటీ సహా మొత్తం 5 మ్యాచ్‌లు అహ్మదాబాద్‌ వేదికగానే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడున్నర నెలలకు ముందుగానే హోటల్ రూమ్ ప్రీబుకింగ్ చేసుకున్నా.. ఒక్క రోజుకి కనీసం రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ సమయాల్లో 10 వేల వరకు ఉండే 5 స్టార్ హోటల్ గదుల ధరలు ఇప్పుడు ఒక్క రోజుకు కనీసం రూ.50 వేలుగా ఉంది.

ఈ నేపథ్యంలోనే ‘అక్టోబర్ 15న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ మెయిన్ అట్రాక్షన్‌గా ఉంది. ఈ మ్యాచ్ చూసేందుకు అక్టోబరు 13 నుంచి 16 వరకు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మ్యాచ్ రోజుల్లోనే బుకింగ్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది’ అని ఐటీసీ నర్మదా జనరల్‌ మేనేజర్‌ కీనన్‌ మెకంజీ తెలిపారు. మరోవైపు ప్రపంచ క్రికెట్ అభిమానులు, స్పాన్సర్స్, వీవీఐపీలు తొలి మ్యాచ్ రోజున సందడి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదిలా ఉండగా.. ‘5 స్టార్ హోటల్స్‌లోని 60-90 శాతం గదులు ఇప్పటికే బుక్ అయ్యాయి. మ్యాచ్ రోజుల కోసం దాదాపు 80 శాతం గదులు బుకింగ్ అయ్యాయి. టోర్నీ ప్రారంభ వేడుకలు, ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్ కోసం ఇంగ్లాండ్, ట్రావెలింగ్ ఎజన్సీలు, కార్పొరేషన్లు ఇప్పటికీకే బుకింగ్స్ చేశాయ’ని అహ్మదాబాద్ హయత్ రీజెన్సీ జనరల్ మేనేజర్ పునిత్ బైజాల్ పేర్కొన్నారు.

హోటల్ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం బేస్‌ కేటగిరీ రూమ్‌ల చార్జీ రూ.50 ఉండగా ప్రీమియమ్ కేటగిరీ రూమ్ ఒక రోజుకు కనీసం రూ. 1 లక్ష ఉండవచ్చు. సాధారణ రోజుల్లో 5 స్టార్ హోటల్స్ రూమ్ ధరలు ఒక్క రోజుకి రూ. 6,500-10,500 మధ్యలో ఉండడం గమనార్హం. హోటల్ చార్జీలపై సంకల్ప్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ బుద్ధరాజా మాట్లాడుతూ ‘అక్టోబర్ 14-16 మధ్య తేదీలకు 40-60 శాతం గదులు బుకింగ్ అయ్యాయి. మ్యాచ్ తేదీల కోసం బుకింగ్స్ మరితంగా పేరిగే అవకాశం ఉంద’న్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..