AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: “ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తిని తొలగించాం, మమ్మల్ని క్షమించండి”

Virat Kohli Hotel Room Video: భారత జట్టు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి హోటల్ గదికి సంబంధించిన వీడియో లీకైంది. దానిపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఈ విషయంలో హోటల్ కఠిన నిర్ణయం తీసుకుంది.

T20 World Cup 2022: ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తిని తొలగించాం, మమ్మల్ని క్షమించండి
Virat Hotel Video
Venkata Chari
|

Updated on: Oct 31, 2022 | 2:40 PM

Share

భారత జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ తాజాగా ఓ వీడియోపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో పెర్త్‌లోని కోహ్లీ హోటల్ గదికి సంబంధించినది. ఆ సమయంలో హోటల్‌లోని కోహ్లీ గదిలోకి ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి.. కోహ్లీ గదిలో లేని సమయంలో వీడియో తీశాడు. ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించి హోటల్ తన ప్రకటన విడుదల చేసి క్షమాపణలు చెప్పింది.

ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకున్నామని, ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తిని హోటల్ నుంచి తొలగించామని ప్రకటించింది. ఈమేరకు క్రౌన్ పెర్త్ పేరుతో ఉన్న హోటల్ ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

“ఈ విషయంలో పాల్గొన్న మా అతిథికి మేం క్షమాపణలు చెబుతున్నాం. సమస్యను పరిష్కరించడానికి క్రౌన్ వెంటనే చర్యలు చేపట్టింది. ఇందులో పాల్గొన్న వ్యక్తిని తొలగించడంతో పాటు క్రౌన్ ఖాతా నుంచి కూడా తొలగించాం. సోషల్ మీడియా నుంచి ఒరిజినల్ వీడియో కూడా తొలగించాం” అంటూ ప్రకటించింది.

దర్యప్తు జరుగుతోంది..

ఈ విషయాన్ని థర్డ్ పార్టీ విచారిస్తున్నట్లు హోటల్ తెలిపింది. “క్రౌన్ ఈ విషయాన్ని థర్డ్ పార్టీ ద్వారా దర్యాప్తు చేస్తోంది. అదేసమయంలో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మేం భారత క్రికెట్ జట్టుకు, ఐసీసీకి క్షమాపణలు చెబుతున్నాం” అంటూ ప్రకటించింది.