Haryana Election 2024: హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ చౌదరి తరపున టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రచారం నిర్వహించారు. బుధవారం జరిగిన బహిరంగ ప్రచార సభలో సెహ్వాగ్ మాట్లాడుతూ అక్టోబర్ 5న అనిరుధ్ చౌదరికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్, అనిరుధ్ చౌదరి చాలా సన్నిహితంగా ఉంటారు. అందుకే హర్యానాలోని తోషమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అనిరుధ్ చౌదరి ప్రచారంలో పాల్గొంటున్నారు.
వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. అనిరుధ్ చౌదరి నాకు సోదరుడిలాంటి వాడు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్న నమ్మకం ఉంది. కాబట్టి అనిరుధ్ చౌదరిని గెలిపించాలని అభ్యర్థించారు.
అలాగే అనిరుధ్ చౌదరి ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా మిమ్మల్ని నిరాశపరచడు. డిమాండ్లన్నీ నెరవేరుస్తాడని వీరేంద్ర సెహ్వాగ్ ప్రజటకు భరోసా ఇచ్చాడు.
ELECTION BREAKING 🚨
Former Cricketer Virender Sehwag bats for Congress: ‘press Congress button on 5th October’.
CONGRESS 🔥 pic.twitter.com/h3AcVoCi49
— Saibpal Pandit (@PanditSaibpal) October 2, 2024
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అక్టోబర్ 5న జరగనుంది. ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రచారంతో అనిరుధ్ చౌదరి తోషమ్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమంటున్నారు.
ఇప్పటికే అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వీరేంద్ర సెహ్వాగ్.. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంతకు ముందు వీరూ భారత్ తరపున 374 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 38 సెంచరీలతో 17 వేలకు పైగా పరుగులు చేశాడు.
ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నికల బరిలోకి దిగి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు ఆదేశాలు ఇచ్చాడు. అందుకే రానున్న రోజుల్లో వీరూ రాజకీయాల్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..