Video: వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే.. బంతి ఎక్కడ తలిగిందో తెలుసా..?

Harmanpreet Kaur Helmet Hit Incident: భారత మహిళా జాతీయ క్రికెట్ జట్టు ప్రస్తుతం 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ఉంది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత భారత్ సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో గెలిచేందుకు ప్రయత్నించి మరోసారి ఓటమిపాలైంది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ ఉండగానే ఉమెన్ ఇన్ బ్లూ సిరీస్ కోల్పోయింది.

Video: వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే.. బంతి ఎక్కడ తలిగిందో తెలుసా..?
Ind Vs Aus Harmanpreet Kaur

Updated on: Feb 27, 2026 | 4:27 PM

Australia Women vs India Women, 2nd ODI: భారత్ మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఆస్ట్రేలియా పర్యటనలో అవాంఛనీయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఫిబ్రవరి 27న హోబార్ట్‌ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల వన్డే మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా స్పిన్నర్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడాలని ప్రయత్నించిన హార్మన్‌ప్రీత్, అదనపు బౌన్స్ కారణంగా షాట్‌ను సరిగా అమలు చేయలేకపోయింది. చివరకు బంతి ఆమె హెల్మెట్ గ్రిల్‌ను బలంగా తాకింది. ఈ ఘటనతో మైదానంలో కాసేపు నిశ్శబ్దం నెలకొంది.

ఒత్తిడిలోనూ వరుసగా రెండో అర్ధశతకం..

3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్ మహిళల జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్‌కు రెండో మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం అయ్యింది. నంబర్-4 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్మన్‌ప్రీత్ కౌర్ 70 బంతుల్లో 54 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆమె ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఇది ఆస్ట్రేలియా బలమైన బౌలింగ్ దాడిపై ఆమె సాధించిన వరుసగా రెండో అర్ధశతకం కావడం విశేషం.

హెల్మెట్ గ్రిల్‌ను తాకిన బంతి..

39వ ఓవర్ చివరి బంతికి మేగన్ షూట్ బౌలింగ్‌లో హార్మన్‌ప్రీత్ రివర్స్ స్వీప్‌కు సిద్ధమయ్యారు. బంతి స్లోగా, ఆఫ్ సైడ్ వైపు బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌గా వచ్చి అదనపు ఎత్తుతో లేచింది. షాట్‌ను లాప్‌గా మార్చే ప్రయత్నంలో బంతి బ్యాట్ దిగువ భాగాన్ని తాకి నేరుగా హెల్మెట్ గ్రిల్‌ను తాకింది.

బంతి హెల్మెట్‌ను తాకగానే ఫిజియో మైదానంలోకి వచ్చి జాగ్రత్తగా పరీక్షించారు. కొంతసేపటి విరామం తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. అదృష్టవశాత్తూ హార్మన్‌ప్రీత్ గాయపడలేదు.

ఈ సంఘటనను వ్యాఖ్యాతగా అక్కడ ఉన్న మిచెత్ స్టార్క్ (Mitchell Starc) ఈసీన్ చూసి నవ్వడం కూడా టీవీ కెమెరాల్లో కనిపించింది.

జట్టు పోరాటం..

ఓపెనర్ ప్రతికా రావల్ కూడా అర్ధశతకం సాధించారు. ఈ ఇద్దరి అర్ధశతకాల సహకారంతో భారత్ మహిళల జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 251 పరుగుల పోటీ స్కోరు నమోదు చేసింది.

ఇంతకుముందు ఫిబ్రవరి 24న బ్రిస్బేన్‌లో జరిగిన తొలి వన్డేలో కూడా 36 ఏళ్ల హార్మన్‌ప్రీత్ 53 పరుగులు చేసింది. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించలేకపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us