మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. మైదానంలో హర్మన్ దురుసు ప్రవర్తనకు 3 డీమెరిట్ పాయింట్లు, ప్రజెంటేషన్ సెరమనీలో ఆమె వ్యవహరించిన తీరుకు ఓ డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ కేటాయించింది.
జూన్ 23న బంగ్లాదేశ్‌లో జరిగిన మూడో వన్డే 34వ ఓవర్‌లో నహిదా అక్టర్‌ను స్వీప్ షాట్ చేయడానికి వెళ్ళింది. ఆ సమయంలో బంతి బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్‌కు తగిలి స్లిప్‌లోకి వెళ్లింది. దీంతో అంపైర్ ఔట్ అయినట్లు వేలు చూపాడు. దీంతో అంపైర్‌పై తీవ్ర అసహనానికి గురైన హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాట్‌తో వికెట్లను పడగొట్టిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా మ్యాచ్ అనంతరం జరగిని ప్రజెంటేషన్ వేడుకలో అంపైర్లపై తీవ్రస్థాయిలో అరోపణలు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దురుసు ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమించింది.
దీంతో రెండు టీ 20లకు హర్మన్‌ప్రీత్ కౌర్ దూరం కావల్సి వచ్చింది. ఒకవేళ ఐసీసీ నింబధన అమలైతే చైనాలోని హాంగ్‌ఝౌ వేదికగా జరుగనున్న ఏసియన్ గేమ్స్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు (టీ20లు) టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లేకుండానే జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్ లేకుండా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్‌లు టీమిండియా జట్టు ఆడాల్సి ఉంటుంది. ఏసియన్ టీ20 క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి జరగనున్నాయి.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ క్రికెటర్‌కి అయినా 2 డీ మెరిట్ పాయింట్ కేటాయిస్తే ఒక టీ20 మ్యాచ్ నిషేధం ఎదుర్కోవల్సి ఉంటుంది. తాజాగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కైర్ 4 డీ మెరిట్ పాయింట్లు పొందుకుంది కాబట్టి ఆ లెక్కన టీమిండియా తదుపరి ఆడే ఆసియా క్రీడల్లో తొలి రెండు టీ20లకు దూరం కావల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌లు నెగ్గి టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటే హర్మన్ ప్రీత్ అడటానికి అవకాశం ఉంటుంది. మరోవైపు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసియాలో టాప్ జట్టుగా ఉన్న భారత్ ఏసియన్ గేమ్స్‌లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. హర్మన్‌కు బదులుగా స్మృతి మంధన టీమిండియా జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా కథనాల కోసం క్లిక్ చేయండి.