GT vs MI: హార్దిక్ రాకతో తెలుగోడిపై వేటు? మస్ట్ విన్ మ్యాచ్ లో ముంబై ఫైనల్ ప్లేయింగ్ XI అంచనా
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కీలక మార్పులతో సిద్ధమవుతోంది. హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడంతో, కొన్ని మార్పులు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. తెలుగు ఆటగాడు సత్య నారాయణ రాజు బెంచ్‌కు చేరే అవకాశం ఉంది, అదే సమయంలో ముంబై బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయనుంది. ముస్తాబైన ముంబై, తొలి విజయాన్ని అందుకోవాలని పట్టుదలగా ఉంది.

ఐపీఎల్ 2025 సీజన్‌ను ఘోర ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్, ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో మరో కీలక పోరుకు సిద్ధమైంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేయాలని ముంబై పట్టుదలగా ఉంది. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ఓడిపోవడంతో విమర్శలు ఎదుర్కొంది. గత కొన్ని సీజన్లుగా తొలి మ్యాచ్‌ను ఓడిపోవడం ముంబైకి అలవాటే. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ కూడా పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. రెండు జట్లూ తమ తొలి విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ఈ పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నిషేధం కారణంగా ఆడలేకపోయాడు. అయితే, గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరులో అతను మళ్లీ జట్టులోకి రాబోతున్నాడు. గతంలో గుజరాత్ టైటాన్స్‌ను విజయవంతంగా నడిపించిన హార్దిక్, ఇప్పుడు ఆ ఫ్రాంచైజీకే వ్యతిరేకంగా ఆడాల్సి వస్తుంది. అతని రీఎంట్రీతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగానికి బలమైన ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.
అయితే, ముంబై స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతను, ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. అతని గైర్హాజరీలో ముంబై పేస్ డిపార్ట్‌మెంట్‌లో మరిన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడంతో, విల్ జాక్స్‌పై వేటు వేసే అవకాశముంది. అతని స్థానంలో ముంబై ఓవర్‌సీస్ పేసర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రిస్ టోప్లీ లేదా మిగతా బౌలింగ్ ఆప్షన్లలో మార్పులు చేయవచ్చు.
తెలుగు యువ క్రికెటర్ సత్య నారాయణ రాజు, గత మ్యాచ్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికీ, కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసే అవకాశాన్ని పొందాడు. హార్దిక్ పాండ్యా రాకతో అతనికి బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. అయితే, ముంబై స్పిన్ విభాగాన్ని మెరుగుపరిచేందుకు కర్ణ్ శర్మను ఆడించే అవకాశాలు ఉన్నాయి. మిచెల్ సాంట్నర్, యువ సంచలన విజ్ఞేష్ పుతుర్‌తో కలిసి కర్ణ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోవచ్చు.
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో తమ తొలి విజయాన్ని నమోదు చేయాలని కసిగా ఉంది. మరోవైపు, గుజరాత్ టైటాన్స్ కూడా తమ మొట్టమొదటి గెలుపును అందుకోవాలని చూస్తోంది. హార్దిక్ పాండ్యా రీఎంట్రీ, ముంబై టీమ్ కాంబినేషన్ మార్పులు, కొత్త బౌలింగ్ ఆప్షన్లతో ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగనుంది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రీస్ టోప్లీ, విజ్ఞేష్ పుతుర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..