CSK: ఐపీఎల్‌లో పెను సంచలనం.. చెన్నై కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. సంజూకి షాకిచ్చిన ధోనీ..?

MS Dhoni Hardik Pandya Meeting: ఐపీఎల్ చరిత్రలో ఈ ట్రేడింగ్ కచ్చితంగా ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుంది. ఈ వారంలో చెన్నైలో ధోనీతో జరిగే కీలక సమావేశం తర్వాత ఈ మెగా డీల్‌పై ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో చెన్నై జట్టు వచ్చే సీజన్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

CSK: ఐపీఎల్‌లో పెను సంచలనం.. చెన్నై కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. సంజూకి షాకిచ్చిన ధోనీ..?
Ms Dhoni Hardik Pandya Meeting

Updated on: Jul 30, 2026 | 4:51 PM

MS Dhoni Hardik Pandya Meeting: ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అతిపెద్ద సంచలనానికి తెరలేవబోతోంది. ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్ గూటికి చేరనున్నాడు. ఏకంగా ఆ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడనే వార్త ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేస్తోంది. ఈ మెగా డీల్ వెనుక ఎంఎస్ ధోనీ మాస్టర్ మైండ్ దాగుంది.

ఐపీఎల్ రాబోయే సీజన్‌కు ముందు క్రీడాభిమానులకు మైండ్‌బ్లాక్ అయ్యే న్యూస్ ఇది. ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని మెగా ట్రేడింగ్‌కు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వేసిన సరికొత్త వ్యూహంతో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పసుపు జెర్సీ వేసుకోబోతున్నాడు. కేవలం ఒక సాధారణ ఆటగాడిగా కాకుండా, ఏకంగా కెప్టెన్ హోదాలో చెన్నై జట్టును లీడ్ చేయబోతున్నాడు. ఈ ప్రతిష్టాత్మక డీల్‌ను ఫైనల్ చేయడానికి హార్దిక్ పాండ్యా ఈ వారంలోనే చెన్నై వెళ్లి తలైవా ఎంఎస్ ధోనీతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నాడు. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ ఎదుర్కొన్న విమర్శలు, అవమానాలు అందరికీ తెలిసిందే.

ఇదికూడా చదవండి: వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. కీలక టోర్నమెంట్‌కు బుడ్డోడు రెడీ.. కెప్టెన్‌గా ఎవరో తెలిస్తే షాకే..?

ఇవి కూడా చదవండి

సొంత ఫ్రాంచైజీ అభిమానులే అతడిని మైదానంలో దారుణంగా ట్రోల్ చేశారు. ఈ చేదు అనుభవాల నేపథ్యంలో ముంబై జట్టును వీడి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో తన కెప్టెన్సీ మార్క్ చూపించాలని హార్దిక్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఇదే సమయాన్ని చూసి చెన్నై ఫ్రాంచైజీ తమ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. ధోనీ స్వయంగా రంగంలోకి దిగి ఈ ట్రేడింగ్‌ను పర్యవేక్షిస్తున్నట్లు క్రీడా వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది.

ముంబై ముందు భారీ ఆఫర్.. ఆ యువ కిశోరం మాత్రం నాట్ ఫర్ సేల్..!

ఈ ట్రేడ్ డీల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ముంబై ఇండియన్స్‌కు ఒక కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చింది. తమ స్టార్ హిట్టర్ శివమ్ దూబే, అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌లను ట్రేడింగ్ ద్వారా ముంబైకి పంపేందుకు సీఎస్‌కే అంగీకరించింది. వారితో పాటే ఏకంగా 10 కోట్ల రూపాయల భారీ నగదును కూడా ముంబైకి చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంటోంది. అయితే ఈ చర్చల సమయంలో ముంబై ఫ్రాంచైజీ మరో యువ సంచలనం ఆయుష్ మ్హత్రేను కూడా ఈ డీల్‌లో భాగంగా తమకు ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం. కానీ, చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం ఆయుష్‌ను వదులుకునే ప్రసక్తే లేదని ముఖం మీదే తేల్చి చెప్పేసింది. అతడు తమ భవిష్యత్ ప్రణాళికల్లో అత్యంత కీలకమని భావిస్తున్న సీఎస్‌కే, ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఆ యువ ఆటగాడిని ముంబైకి ఇచ్చేందుకు ససేమిరా అంది.

ఇదికూడా చదవండి: తొలుత 175 పరుగులు, ఆ తర్వాత 9 వికెట్లు.. లంకను దహనం చేసిన టీమిండియా తోపు

ఢిల్లీ, కోల్‌కతా ఆఫర్లకు నో.. ధోనీ వారసుడిగానే..!

హార్దిక్ పాండ్యా ముంబైని వీడుతున్నాడనే వార్త రాగానే మిగతా ఫ్రాంచైజీలు కూడా అతడి కోసం గాలం వేశాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తమ జట్టుకు కెప్టెన్‌గా రావాలంటూ భారీ ఆఫర్లతో హార్దిక్‌ను సంప్రదించాయి. కోట్లకు కోట్లు గుమ్మరించేందుకు సిద్ధమయ్యాయి. కానీ హార్దిక్ మాత్రం ఆ రెండు ఫ్రాంచైజీల ఆఫర్లను సున్నితంగా తిరస్కరించాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన, ప్రశాంతమైన వాతావరణం ఉండే చెన్నై సూపర్ కింగ్స్ వైపే అతడు మొగ్గు చూపాడు. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి లెజెండ్ అండదండలు ఉంటే తన కెప్టెన్సీ కెరీర్‌కు ఇక తిరుగుండదని హార్దిక్ బలంగా నమ్ముతున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ ఉంటే ఎంతటి ఒత్తిడినైనా సునాయాసంగా జయించవచ్చని భావించాడు. అందుకే ఎవరెన్ని ఆఫర్లు ఇచ్చినా తన దృష్టి కేవలం పసుపు జెర్సీపైనే ఉందని ఫ్రాంచైజీలకు స్పష్టం చేశాడు.

నేరుగా కెప్టెన్‌గానే ఎంట్రీ.. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కొరత తీరేనా..?

రాబోయే ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ పాండ్యా నేరుగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగుతాడని సమాచారం. రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్‌లో జట్టును నడిపించినప్పటికీ, ఫ్రాంచైజీ మాత్రం ఒక అగ్రెసివ్ మాస్ లీడర్ కోసం వెతుకుతోంది. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూనే, మైదానంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకునే నాయకుడి కొరత సీఎస్‌కేలో స్పష్టంగా కనిపించింది. ఆ లోటును భర్తీ చేయడానికి హార్దిక్ కంటే సరైన ఆప్షన్ మరొకటి లేదని చెన్నై యాజమాన్యం నిర్ణయానికి వచ్చింది. దానికి తోడు సీఎస్‌కేలో ఎప్పటినుంచో ఉన్న ఒక నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కొరతను కూడా హార్దిక్ రాకతో తీర్చవచ్చని ధోనీ పక్కా మాస్టర్ స్కెచ్ వేశాడు. మొత్తానికి ముంబైలో అవమానాలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా, ఇప్పుడు ఐపీఎల్‌లోనే అత్యంత క్రేజ్ ఉన్న చెన్నై జట్టుకు బాస్ కాబోతుండటం క్రికెట్ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us