
ENG vs IND: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంలో రిషభ్ పంత్ (Rishabh Pant) , హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) కీలక పాత్ర పోషించారు. పంత్ (113 బంతుల్లో 125 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో చెలరేగగా.. హార్ధిక్ బంతితోను, బ్యాట్‌తోను అదరగొట్టాడు. బౌలింగ్‌లో కేవలం 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన హార్ధిక్.. బ్యాటింగ్‌లో 71 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదిలా ఉంటే పాండ్యాకు తన వన్డే కెరీర్‌లో ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం విశేషం. ఇక లక్ష్య ఛేదనలో 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారతజట్టును కీలక ఇన్నింగ్స్‌తో గాడిలో పెట్టాడీ ఆల్‌రౌండర్. 72 పరుగులు చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈక్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారంతో పాటు పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు పాండ్యా. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
పాండ్యా తాజా రికార్డులివే..
6⃣ Wickets ?
1⃣0⃣0⃣ Runs ?For his solid all-round performance, @hardikpandya7 bags the Player of the Series award. ? ? #TeamIndia | #ENGvIND pic.twitter.com/iOY9pLPeIG
— BCCI (@BCCI) July 17, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..