Video: రషీద్ కాక.. నువ్వు కేక.. థ్రిల్లింగ్ క్యాచ్‌తో చెన్నైని అస్సాం ట్రైన్ ఎక్కించావ్‌గా.. వైరల్ వీడియో

Rashid Khan Catch Video, GT vs CSK: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు రషీద్ ఖాన్ బౌండరీకి సమీపంలో రుతురాజ్ గైక్వాడ్ అందించిన క్యాచ్ పట్టాడు. నియంత్రణ కోల్పోయినప్పటికీ, బౌండరీ లైన్ నుంచి తనను తాను రక్షించుకుంటూ ఒంటి చేత్తో క్లీన్ క్యాచ్ పట్టాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో మ్యాచ్ మొత్తం మారిపోయింది.

Video: రషీద్ కాక.. నువ్వు కేక.. థ్రిల్లింగ్ క్యాచ్‌తో చెన్నైని అస్సాం ట్రైన్ ఎక్కించావ్‌గా.. వైరల్ వీడియో
Rashid Khan Catch Video

Updated on: May 11, 2024 | 10:37 AM

Rashid Khan Catch Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 59వ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుతమైన సెంచరీలు చేశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో గుజరాత్‌ బౌలింగ్‌కు దిగిన సీఎస్‌కే పవర్‌ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో జట్టు ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌండరీ లైన్ దగ్గర రుతురాజ్ గైక్వాడ్ అందించిన క్యాచ్‌ను పట్టిన తీరుతో మ్యాచ్ మొత్తం మారిపోయింది.

ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ ఐదో బంతికి సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. బంతి దాదాపు బౌండరీ లైన్ దాటినట్లే అనిపించింది. అయితే, ఈ సందర్భంగా రషీద్ బౌండరీ దగ్గరికి దూకి క్యాచ్ తీసుకున్నాడు. అయితే, ఈ సమయంలో అతను నియంత్రణ కోల్పోవడంతో బంతి చేతికి అందకుండా పోయింది.

ఇవి కూడా చదవండి

బంతిని గాలిలోకి విసిరిన రషీద్ బౌండరీ లైన్ నుంచి కాపాడుకుంటూ ఒంటి చేత్తో క్లీన్ క్యాచ్ పట్టాడు. రషీద్ పాదం మొదట్లో బౌండరీ లైన్‌ను తాకినట్లు కనిపించినప్పటికీ, వీడియోను నిశితంగా పరిశీలిస్తే అది కొన్ని అంగుళాల దూరంలో మాత్రమే ఉందని తేలింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రషీద్ ఖాన్ వైరల్ వీడియో..

కీలక మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది. గుజరాత్ తరపున శుభమన్ గిల్, సుదర్శన్ సెంచరీలు చేశారు. సీఎస్‌కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..