గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022(IPL 2022) టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. గుజరాత్ విజయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. అతను ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పాండ్యా 34 పరుగులతో పాటు 3 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు టైటిల్స్‌తో పాటు ప్రైజ్‌మనీ దక్కింది. జోస్ బట్లర్ ఈ సీజన్ పర్పుల్ క్యాప్ గెలుచుకోగా, యుజ్వేంద్ర చాహల్ పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో అత్యధిక పరుగులు చేసిన పరంగా రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 17 మ్యాచ్‌లు ఆడి 863 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించాడు. బట్లర్ ఆరెంజ్ క్యాప్‌ని కైవసం చేసుకున్నాడు. అతనికి పారితోషికంగా రూ.15 లక్షలు ఇచ్చారు. చాహల్ పర్పుల్ క్యాప్ గెలుచుకోవడంతోపాటు రూ.15 లక్షలు అందుకున్నాడు. ఈ సీజన్‌లో చాహల్ 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు.
ఈ సీజన్‌లో బట్లర్ బలమైన ప్రదర్శన ఇచ్చాడు. అతనికి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఇందులో అతనికి రూ.12 లక్షల ప్రైజ్ మనీ లభించింది. బట్లర్ 387.5 పాయింట్లు సాధించాడు. కాగా ఈ విషయంలో హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో నిలిచాడు. అతను 284.5 పాయింట్లు సాధించాడు.
ఎవరికి ఎంత డబ్బు లభించిందంటే..
విజేత జట్టు: గుజరాత్ టైటాన్స్, రూ. 20 కోట్లు
ఓడిన జట్టు: రాజస్థాన్ రాయల్స్, రూ.13 కోట్లు
నం. 3 జట్టు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రూ. 7 కోట్లు
నం. 4 జట్టు: లక్నో సూపర్ జెయింట్స్, రూ.6.5 కోట్లు
పర్పుల్ క్యాప్ విజేత: యుజ్వేంద్ర చాహల్, రూ. 15 లక్షలు
ఆరెంజ్ క్యాప్ విజేత: జోస్ బట్లర్, రూ. 15 లక్షలు
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: దినేష్ కార్తీక్, రూ. 15 లక్షలు, టాటా పంచ్ కార్
పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: జోస్ బట్లర్, రూ. 12 లక్షలు
సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడు: జోస్ బట్లర్, రూ. 12 లక్షలు
గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్: జోస్ బట్లర్, రూ. 12 లక్షలు
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: ఉమ్రాన్ మాలిక్, రూ. 20 లక్షలు
సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు: జోస్ బట్లర్, రూ. 10 లక్షలు
సీజన్‌లో వేగవంతమైన బాల్: లాకీ ఫెర్గూసన్, రూ. 10 లక్షలు
సీజన్‌లో అత్యధిక ఫోర్లు: జోస్ బట్లర్, రూ. 10 లక్షలు
క్యాచ్ ఆఫ్ ది సీజన్: ఎవిన్ లూయిస్, రూ. 10 లక్షలు