MS Dhoni – CSK: సీఎస్కే ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. మరో రెండేళ్లు కెప్టెన్‌గా మహేంద్రుడే..!

| Edited By: Janardhan Veluru

Jul 08, 2021 | 11:37 AM

MS Dhoni - Chennai Super Kings: మాజీ టీమిండియా ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ బుధవారమే 40వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

MS Dhoni - CSK: సీఎస్కే ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. మరో రెండేళ్లు కెప్టెన్‌గా మహేంద్రుడే..!
Csk Dhoni
Follow us on

MS Dhoni: మాజీ టీమిండియా ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ బుధవారమే 40వ వసంతంలోకి అడుగుపెట్టాడు. భారత క్రికెట్‌లో ఉన్న సమయంలో.. టీమిండియాను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన జార్ఖండ్ డైనమేట్.. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను కూడా అన్ని రంగాల్లో తీర్చి దిద్దుతున్నాడు. అయితే, ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో… చైన్నై టీం మేనేజ్‌మెంట్ స్పందించింది. మా కెప్టెన్ ధోనీనే అని ప్రకటించింది. మరో రెండేళ్లు సీఎస్కే సారథ్య బాధ్యతలు ధోనీనే చూసుకుంటాడని పేర్కొంది. ఈ మేరకు సీఎస్కే ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్ననాథన్ ఐఏఎన్ఎస్ తో వెల్లడించాడు. దీంతో ధోనీ అభిమానులతో పాటు సీఎస్‌కే ఫ్యాన్స్ కూడా సంబురాల్లో మునిగిపోయారు. ఇప్పిటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోనీ.. ఐపీఎల్ లో అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, యూఏఈ లో జరిగే ఐపీఎల్ 2021లోనూ ధోనీనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వాయిదా పడిన మ్యాచులను తిరిగి ప్రారంభించనున్నారు. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈమేరకు మాజీ భారత వికెట్ కీపర్ విజయ్ దహియా మాట్లాడుతూ, సీఎస్కే అంటేనే ధోనీ, ధోనీ అంటేనే సీఎస్కే, అలా తన పేరును లఖించాడు. టీ20 క్రికెట్‌లో ఎన్నో మ్యాచులు ఆడిన అనుభవం ధోనీ సొంతం. సీఎస్కే కి ధోనీ అవసరం చాలా ఉంది. ధోనీ సలహాల మేరకు ఎంతో మంది ప్లేయర్లు ఐపీఎల్‌లో రాణిస్తున్నారు. ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ కరణ్ ఇందుకు చక్కని ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో ధోనీని రీప్లేస్ చేయడం అసాధ్యమన్నాడు.

Also Read:

India vs Sri lanka: లంక ప్లేయర్లకు తప్పిన ప్రమాదం.. భారత్‌లో దిగిన విమానం..!

MS Dhoni vs Gambhir: కోపంతో చేశాడా.. కావాలనే చేశాడా..? గంభీర్‌పై ధోనీ అభిమానుల ఫైర్!

Happy Birthday Sourav Ganguly: 49వ వసంతంలోకి బెంగాల్ టైగర్.. విదేశాల్లో విజయాలకు కేరాఫ్ అడ్రస్..!