AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GenZ Cricketers : ఐస్ బాత్‌లు, నో ఫోన్ రూల్స్.. టీమిండియా కుర్రాళ్ల ‘సండే సీక్రెట్’ ఇదే

GenZ Cricketers : సాధారణంగా ఆదివారం ఉదయం 6 గంటలంటే కుర్రాళ్లంతా దుప్పటి ముసుగేసి పడుకుంటారు. కానీ టీమిండియా కొత్త తరం క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సూర్యాంశ్ శెడ్గే మాత్రం అప్పుడే మంచు ముక్కలు నింపిన ఐస్ టబ్‌లో మునిగి తేలుతున్నారు.

GenZ Cricketers : ఐస్ బాత్‌లు, నో ఫోన్ రూల్స్.. టీమిండియా కుర్రాళ్ల ‘సండే సీక్రెట్’ ఇదే
Genz Cricketers
Rakesh
|

Updated on: Jun 28, 2026 | 10:39 AM

Share

GenZ Cricketers : సాధారణంగా ఆదివారం ఉదయం 6 గంటలంటే కుర్రాళ్లంతా దుప్పటి ముసుగేసి పడుకుంటారు. కానీ టీమిండియా కొత్త తరం క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సూర్యాంశ్ శెడ్గే మాత్రం అప్పుడే మంచు ముక్కలు నింపిన ఐస్ టబ్‌లో మునిగి తేలుతున్నారు. యూరోపియన్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, విరాట్ కోహ్లీల ఫిట్‌నెస్ మంత్రాన్ని వంటబట్టించుకున్న ఈ జెన్-జీ ప్లేయర్లు, తమ శరీరాన్ని పక్కా మెషిన్‌లా మార్చేస్తున్నారు. ఈ ఐస్ బాత్ థెరపీ వల్ల కండరాల నొప్పులు తగ్గడమే కాకుండా, ఆటలో మరింత వేగంగా కదలడానికి వీలవుతుందని ఫ్రాంచైజీల ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.

బిర్యానీలకు గుడ్ బై.. సలాడ్స్ కి వెల్‌కమ్

ఒకప్పుడు మ్యాచ్ ముగిసిందంటే చికెన్ బిర్యానీలు, నెయ్యి కుమ్మరించిన పరాటాలతో ఎంజాయ్ చేసే ట్రెండ్ ఉండేది. కానీ ఈ తరం ఆటగాళ్లు ఆదివారం బ్రేక్‌ఫాస్ట్‌ను ఒక పక్కా ప్లాన్ ప్రకారం తీసుకుంటున్నారు. సూర్యాంశ్ శెడ్గే లాంటి ఆల్ రౌండర్లు పూర్తిగా ప్లాంట్ బేస్డ్ (మొక్కల ఆధారిత) ఆహారానికి మారిపోయారు. ఓట్స్, మొలకెత్తిన గింజలు, కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్‌లతో రోజును ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ వేలంలో తమ బాడీనే అత్యంత విలువైన ఆస్తి అని, దానికి చిన్న గాయమైనా కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఈ కుర్రాళ్లు గ్రహించారు. అందుకే తిండి విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు.

సోషల్ మీడియాకు ఐదు గంటల బ్రేక్

మైదానంలో ప్రదర్శన ఎంత ముఖ్యమో.. మానసిక ప్రశాంతత అంతకంటే ముఖ్యం. అందుకే ఈ జెన్-జీ క్రికెటర్లు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. దీనిని వారు డిజిటల్ సబ్బాత్ (ఫోన్ రహిత సమయం) అని పిలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, టీమ్ సెలక్షన్ గురించిన చర్చలు తమ నిద్రను, ప్రశాంతతను పాడు చేయకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల ధ్వని కాలుష్యానికి దూరంగా ఉంటూ, ప్రాణాయామం, మెడిటేషన్ ద్వారా మైండ్ రిఫ్రెష్ చేసుకుంటున్నారు.

భారత యువతపై క్రికెటర్ల ప్రభావం

భారతదేశంలో దాదాపు 37 కోట్ల మందికి పైగా ఉన్న జెన్-జీ యువత ఇప్పుడు సినిమా స్టార్లను కాకుండా ఈ యువ క్రికెటర్లనే రోల్ మోడల్స్‌గా తీసుకుంటున్నారు. వీరు ఫాలో అయ్యే ఐస్ బాత్ టబ్‌లు ఇప్పుడు అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సెలబ్రిటీల కంటే ఈ క్రికెటర్ల లైఫ్‌స్టైల్‌నే కాలేజీ కుర్రాళ్లు, స్టార్టప్ ఉద్యోగులు ఎక్కువగా అనుకరిస్తున్నారు. మైదానంలో సిక్సర్లు కొట్టడమే కాదు, జీవితంలో ఎలా ఫిట్‌గా ఉండాలో కూడా ఈ కొత్త తరం ప్లేయర్లు నిరూపిస్తున్నారు. భవిష్యత్తులో ఈ రికవరీ రూల్స్ అన్ని ఫ్రాంచైజీల్లో తప్పనిసరి కానున్నాయి.

మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us