LPL 2024: 34 బంతుల్లో 241 స్ట్రైక్‌రేట్‌.. 8 ఫోర్లు, 6 సిక్సర్లతో ప్రీతి జింటా ఫేవరేట్ ప్లేయర్ ఊచకోత..

|

Jul 22, 2024 | 9:46 AM

Galle Marvels vs Jaffna Kings: లంక ప్రీమియర్ లీగ్ 2024 చివరి మ్యాచ్ కొలంబోలో గాలె మార్వెల్స్, జాఫ్నా కింగ్స్ మధ్య జరిగింది. జులై 21 ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన భానుక రాజపక్సే సంచలనం సృష్టించాడు. 34 బంతుల్లో 241 స్ట్రైక్ రేట్‌తో 82 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో దుమ్మురేపాడు.

LPL 2024: 34 బంతుల్లో 241 స్ట్రైక్‌రేట్‌.. 8 ఫోర్లు, 6 సిక్సర్లతో ప్రీతి జింటా ఫేవరేట్ ప్లేయర్ ఊచకోత..
Bhanuka Rajapaksa Lpl2024
Follow us on

Bhanuka Rajapaksa Half Century: లంక ప్రీమియర్ లీగ్ 2024 చివరి మ్యాచ్ కొలంబోలో గాలె మార్వెల్స్, జాఫ్నా కింగ్స్ మధ్య జరిగింది. జులై 21 ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన భానుక రాజపక్సే సంచలనం సృష్టించాడు. జాఫ్నా కింగ్స్‌ టాస్‌ గెలిచి గాలె మార్వెల్స్‌ని బ్యాటింగ్‌ చేయమని కోరింది. గాలె ఆరంభం అంత బాగోలేదు. 7 ఓవర్లలోనే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 24 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత భానుక రాజపక్సే బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను తన తుఫాను ఇన్నింగ్స్‌తో గాలె జట్టును పటిష్ట స్థితిలో ఉంచాడు.

34 బంతుల్లో 82 పరుగులు..

న్యూజిలాండ్‌ ఆటగాడు టిమ్‌ సీఫెర్ట్‌తో కలిసి భానుక రాజపక్సే ఇన్నింగ్స్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. సీఫెర్ట్ ఒక ఎండ్ నుంచి కీలక పాత్రను పోషిస్తూనే ఉన్నాడు. రాజపక్సే రెండో ఎండ్ నుంచి బౌండరీలు స్కోర్ చేస్తూనే ఉన్నాడు. అతను కేవలం 34 బంతుల్లో 241 స్ట్రైక్ రేట్‌తో 82 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. సీఫెర్ట్ అతనికి పూర్తిగా మద్దతు ఇచ్చాడు. అతను కూడా 37 బంతుల్లో 47 పరుగులు చేశాడు. భానుక ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో గాలె 184 పరుగుల భారీ స్కోరు సాధించింది.

పంజాబ్ కింగ్స్‌ తరపున అద్భుత ప్రదర్శన..

భానుక రాజపక్సే గతంలో కూడా ఐపీఎల్‌లో సందడి చేశారు. అతను 2022, 2023లో ఐపీఎల్ రెండు సీజన్లలో పాల్గొన్నాడు. ఈ సమయంలో అతను పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడాడు. 2023 సీజన్ అతనికి ప్రత్యేకమైనది కాదు. అతను 4 మ్యాచ్‌లలో మాత్రమే అవకాశం పొందాడు. అందులో అతను 114 స్ట్రైక్ రేట్‌తో 71 పరుగులు చేశాడు. అయితే, 2022 సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో 206 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ (159) కూడా అద్భుతంగా ఉంది. ఈ సీజన్‌లో, అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 22 బంతుల్లో 43 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ సహాయంతో పంజాబ్ 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

ఫిట్‌నెస్‌ కారణంగా ఏడాదిన్నర పాటు ఔట్‌..

భానుక రాజపక్సే తన ఫిట్‌నెస్ విషయంలో వివాదాల్లో చిక్కుకున్నాడు. 2021లో జట్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత సెలక్టర్లపై తీవ్ర విమర్శలు చేశాడు. జట్టు ఎంపిక ఫిట్‌నెస్‌పై కాకుండా ప్రదర్శన ఆధారంగా ఉండాలని అతను నమ్మాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు విధానాలను కూడా ఆయన విమర్శించారు. ఇది మాత్రమే కాదు, అతను గత ఒకటిన్నర సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..