AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్.. టాప్‌లో ఎవరున్నారంటే?

ICC World Cup 2023: ప్రపంచ కప్ 2023 (ICC World Cup 2023) ఫైనల్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి 6వ సారి వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. ఈ టోర్నీలో భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో తడబడింది.

ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్.. టాప్‌లో ఎవరున్నారంటే?
Team India Journey
Venkata Chari
|

Updated on: Nov 20, 2023 | 8:31 PM

Share

ICC ODI World Cup 2023: ఐసీసీ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5న భారతదేశంలో ప్రారంభమై.. నవంబర్ 19 వరకు జరిగింది. నిన్న జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ఆరోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియాతో పాటు పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ పాల్గొన్నాయి.

ప్రపంచ కప్ 2023 (ICC World Cup 2023) ఫైనల్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి 6వ సారి వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. ఈ టోర్నీలో భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో తడబడింది.

లీగ్ దశలో అన్ని జట్లు ఒకదానితో ఒకసారి తలపడ్డాయి. టాప్ 4 జట్లు (భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. అయితే, ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఓసారి చూద్దాం..

ICC ODI ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ వీరే..

1- విరాట్ కోహ్లీ (భారతదేశం): మ్యాచ్‌లు – 11, పరుగులు – 765, సగటు – 95.62, 6 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు, అత్యధిక స్కోరు – 117

2- రోహిత్ శర్మ (భారతదేశం): మ్యాచ్‌లు – 11, పరుగులు – 597, సగటు – 54.27, 3 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ – 3/1, అత్యధిక స్కోరు – 131

3- క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) : మ్యాచ్‌లు – 10, పరుగులు – 594, సగటు – 59.40, 4 సెంచరీల, అత్యధిక స్కోరు – 174

4- రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) : మ్యాచ్‌లు – 10, పరుగులు – 578, సగటు – 64.22, 2 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు, అత్యధిక స్కోరు – 123*

5- డారెల్ మిచెల్ (న్యూజిలాండ్): మ్యాచ్‌లు – 10, పరుగులు – 552, సగటు – 69.00, 2 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు, అత్యధిక స్కోరు – 134.

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..