Prize Money : ధోనీ కప్పు కొడితే కోటి రూపాయలు.. రోహిత్ కప్పు కొడితే కోటేశ్వరులు ..18 ఏళ్లలో అమాంతం పెరిగిన ప్రైజ్ మనీ

Prize Money : క్రికెట్ అంటే భారత్‌లో కేవలం ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఈ ఆటలో గెలిస్తే వచ్చే క్రేజ్, గౌరవం మాటల్లో చెప్పలేం. కానీ ఆ విజయంతో పాటు వచ్చే ప్రైజ్ మనీ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. తాజాగా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ శర్మ సేనకు బీసీసీఐ ఏకంగా రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది.

Prize Money : ధోనీ కప్పు కొడితే కోటి రూపాయలు.. రోహిత్ కప్పు కొడితే కోటేశ్వరులు ..18 ఏళ్లలో అమాంతం పెరిగిన ప్రైజ్ మనీ
Team India

Updated on: Feb 02, 2026 | 7:24 PM

Prize Money : క్రికెట్ అంటే భారత్‌లో కేవలం ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఈ ఆటలో గెలిస్తే వచ్చే క్రేజ్, గౌరవం మాటల్లో చెప్పలేం. కానీ ఆ విజయంతో పాటు వచ్చే ప్రైజ్ మనీ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. తాజాగా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ శర్మ సేనకు బీసీసీఐ ఏకంగా రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల క్రితం ధోనీ టీమిండియాకు తొలి వరల్డ్ కప్ అందించినప్పుడు ఎంత నగదు బహుమతి లభించిందో తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. తన ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికం విషయంలో బీసీసీఐ ఏమాత్రం వెనకాడదు. 2024 టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాను ఓడించి భారత్ ఛాంపియన్‌గా నిలిచినప్పుడు, బోర్డు ఏకంగా రూ.125 కోట్లను జట్టు మొత్తానికి పంచింది. ఇందులో కేవలం 15 మంది ఆటగాళ్లే కాకుండా, రిజర్వ్ ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్, మెడికల్ టీమ్, సెలెక్టర్లు కూడా భాగస్వాములుగా ఉన్నారు. అయితే, 2007లో ఎంఎస్ ధోనీ సారధ్యంలో టీమిండియా తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వచ్చిన ప్రైజ్ మనీ దీనితో పోలిస్తే చాలా తక్కువ.

2007లో యువ భారత్ సంచలనం సృష్టించినప్పుడు, బీసీసీఐ మొత్తం జట్టుకు కలిపి కేవలం రూ.12 కోట్లు మాత్రమే బహుమతిగా ఇచ్చింది. అంటే నేడు ఒక్కో ఆటగాడికి లభిస్తున్న రూ.5 కోట్లతో పోలిస్తే, అప్పుడు మొత్తం జట్టుకు లభించిన నగదు చాలా తక్కువని చెప్పవచ్చు. ఇక 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు తొలుత ఒక్కో ఆటగాడికి కోటి రూపాయలు ప్రకటించగా, తర్వాత దానిని రూ.2 కోట్లకు పెంచారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు కూడా ప్రతి ఆటగాడికి కోటి రూపాయల చొప్పున నగదు లభించింది. కానీ 2024 నాటికి ఈ లెక్కలు పూర్తిగా మారిపోయాయి.

రోహిత్ సేనలో ఎవరికి ఎంత దక్కింది?

2024 ప్రపంచకప్ విజేతలకు బీసీసీఐ పంపిణీ చేసిన రూ.125 కోట్ల వివరాలు ఇలా ఉన్నాయి:

ప్రధాన ఆటగాళ్లు (15 మంది): ఒక్కొక్కరికి రూ.5 కోట్లు(మ్యాచులు ఆడని వారు కూడా ఇందులో ఉన్నారు).

రిజర్వ్ ప్లేయర్స్ (నలుగురు ): ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు.

హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్: రూ.5 కోట్లు.

కోచింగ్ స్టాఫ్: ఒక్కొక్కరికి రూ.కోటి.

సపోర్ట్ స్టాఫ్ (ఫిజియో, మెడికల్): ఒక్కొక్కరికి రూ.2 కోట్లు.

సెలెక్టర్లు: ఒక్కొక్కరికి రూ.కోటి.

ఈ గణాంకాలను బట్టి చూస్తే, భారత క్రికెట్ ఆదాయం ఎంత వేగంగా వృద్ధి చెందిందో అర్థమవుతుంది. స్పాన్సర్లు, టీవీ హక్కులు, ఐపీఎల్ వంటి లీగ్‌ల వల్ల బీసీసీఐ ఖజానా నిండిపోవడంతో ఆటగాళ్లకు కూడా భారీగా ప్రతిఫలం అందుతోంది. విజయానికి ఇచ్చే గౌరవం అప్పట్లోనూ ఇప్పట్లోనూ ఒకటే అయినప్పటికీ, ఆర్థికంగా మాత్రం ప్రస్తుత ఆటగాళ్లు చాలా అదృష్టవంతులని చెప్పాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..