
India vs South Africa: రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా అద్భుతంగా రాణించింది. బ్యాట్స్‌మెన్స్‌తోపాటు బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన కారణంగా భారత జట్టు ఈ మ్యాచ్ గెలిచింది. అయితే, ముగ్గురు ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం నిరాశపరిచింది. దీంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వారిని రెండవ వన్డే నుంచి తొలగించే అవకాశం ఉందని వాదనలు వినిపించాయి. మునుపటి మ్యాచ్‌లో వీరి పేలవమైన ప్రదర్శనకు ఫలితంగా ఈ మార్పులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్లేయింగ్ ఎలెవన్‌ను బలోపేతం చేయడానికి గంభీర్ మూడు కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రాంచీ వన్డే బ్యాట్స్‌మన్స్‌కు అనుకూలమైన పిచ్‌ను అందించింది. ఇందులో 681 పరుగులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ తన 52వ వన్డే సెంచరీని సాధించాడు. రోహిత్ శర్మ కూడా అర్ధ శతకం జోడించాడు. అయితే బ్యాటింగ్, బంతి రెండింటిలోనూ విఫలమైన ముగ్గురు భారతీయ ఆటగాళ్ళు కూడా ఉన్నారు.
తొలి వన్డే తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు రాయ్‌పూర్‌లో జరిగే రెండవ వన్డే నుంచి ఈ ముగ్గురు ఆటగాళ్లను తప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాంచీ వన్డేలో పేలవ ప్రదర్శనకు ఈ ముగ్గురు ఆటగాళ్లు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. రాంచీ వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్‌లో ఆడిన ముగ్గురు ఆటగాళ్లపై విచారణ జరుగుతోందని, ఎందుకంటే రాయ్‌పూర్ వన్డేకు ముందు కోచ్ గౌతమ్ గంభీర్ మార్పులను పరిశీలిస్తున్నాడని సమాచారం.
రాంచీ పిచ్ బ్యాటింగ్ స్వర్గధామంగా నిరూపితమైంది. ఈ మ్యాచ్‌లో 650 పరుగులు నమోదయ్యాయి. అయినప్పటికీ కొంతమంది భారత ఆటగాళ్ళు ప్రభావం చూపలేకపోయారు. బ్యాట్స్‌మెన్స్‌కు అత్యంత అనుకూలంగా ఉన్న రాంచీ పిచ్‌పై వారి ప్రదర్శన జట్టు యాజమాన్యంలో ఆందోళనలను రేకెత్తించింది. తదుపరి మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు ఉండనున్నట్లు కచ్చితంగా తెలుస్తోంది.
రుతురాజ్ గైక్వాడ్ అత్యంత నిరాశపరిచే ప్రదర్శనకారులలో ఒకడిగా చేరాడు. స్ట్రోక్ మేకింగ్ సులభం అనిపించే, సహజంగానే భారీగా పరుగులు వచ్చే పిచ్‌పై, అతను 14 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. క్రీజులో ఉన్న కొద్ది సమయంలో ఎటువంటి ఊపును చూపించలేకపోయాడు. టీమిండియా టాప్-ఆర్డర్ బలమైన ప్రదర్శనను బట్టి చూస్తే, మంచి పరిస్థితులలో అతను స్ట్రైక్‌ను రోటేట్ చేయడంలో, బౌండరీలను కొట్టడంలో విఫలమవడం మరింత స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే భారత జట్టులో చోటు కోసం పోటీ పెరగడంతో, ఇలాంటి పిచ్‌పై గైక్వాడ్ ప్రదర్వన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రణాళికలకు విరుద్ధంగా ఉన్నాయి. అందువల్ల, రాజ్‌పూర్ వన్డే కోసం జట్టులో మార్పులు ఆశించవచ్చు.
అంచనాలను అందుకోలేకపోయిన మరో ఆటగాడు వాషింగ్టన్ సుందర్. రెండు విభాగాలలోనూ సహకారం అందించాల్సిన బాధ్యత అతనికి ఉంది. కానీ అతను రాణించలేదు. సుందర్ 19 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి, చివరి ఓవర్లలో భారత జట్టుకు అవసరమైన తుది మెరుగులు దిద్దడంలో విఫలమయ్యాడు. బంతితో మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు. వికెట్లు తీయడంలో ఘోరంగా విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేదు. మొత్తంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు. అధిక స్కోరు ఉన్న మ్యాచ్‌లో భాగస్వామ్యాలను విచ్ఛిన్నం చేయడంలో లేదా బ్యాట్‌తో గణనీయమైన సహకారం అందించడంలో అతను విఫలమవడం వల్ల తదుపరి వన్డే ముందు అతని స్థానం బలహీనపడింది.
పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. అతను ఒక వికెట్ తీసినప్పటికీ, 7.2 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి ఇన్నింగ్స్‌లోని కీలకమైన సమయాల్లో నియంత్రణ కోల్పోయాడు. అతని ఖరీదైన స్పెల్ దక్షిణాఫ్రికా 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి సహాయపడింది. అతని పేలవమైన బౌలింగ్ వల్ల ఏర్పడిన ఒత్తిడి సీనియర్ బౌలర్లపైకి వెళ్ళింది. దీంతో రాయ్‌పూర్ జట్టు కూర్పు గురించి యాజమాన్యం చర్చించినప్పుడు ప్రసిద్ధ్ అస్థిరత అతనికి వ్యతిరేకంగా మారవచ్చు.
విరాట్ కోహ్లీ అద్భుతమైన 135 పరుగులు, అతని 52వ వన్డే సెంచరీ, రోహిత్ శర్మ 57 పరుగులతో జట్టును 349 పరుగులకు చేర్చడంతో టీం ఇండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా చివర వరకు పోరాడినప్పటికీ 332 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ఉత్కంఠ విజయాన్ని దక్కించుకుంది. అయితే, కోచ్ గౌతమ్ గంభీర్ దృక్కోణంతో కొంతమంది ఆటగాళ్ళు ఇప్పుడు వారి పేలవమైన ఫామ్‌కు మూల్యం చెల్లించాల్సి రావొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..