
Year Ender 2025: కొంతమందికి ఈ ఏడాది నిరాశ మిగిల్చినా, మరికొందరు మాత్రం 12 నెలల పాటు మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. ఇటువంటి వారిలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2025లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా అతను నిలిచాడు. రూట్ సాధించిన ఘనతలో విశేషం ఏమిటంటే, ఈ ఏడాది అతను అంతర్జాతీయ క్రికెట్‌లో కొట్టిన సిక్సర్ల కంటే చేసిన శతకాలే ఎక్కువ. అతనితో పాటు మరో నలుగురు ఆటగాళ్లు కూడా ఈ ఏడాది సెంచరీల వర్షం కురిపించారు. ఇందులో ఇద్దరు భారత ఆటగాళ్లు కూడా ఉన్నారు. వారు ఎవరంటే..
1. జో రూట్ (Joe Root) – నంబర్ 1 శతక వీరుడు ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ 2025లో అత్యధికంగా 7 సెంచరీలు సాధించాడు. కేవలం 33 ఇన్నింగ్స్‌ల్లోనే అతను ఈ ఘనత అందుకోవడం విశేషం. 53 పైగా సగటుతో మొత్తం 1613 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రూట్ ఈ ఏడాది 7 సెంచరీలు చేస్తే, కేవలం 5 సిక్సర్లు మాత్రమే కొట్టాడు.
2. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) – నంబర్ 2 టీమ్ ఇండియా స్టార్ శుభ్‌మన్ గిల్ కూడా 2025లో 7 సెంచరీలు బాదాడు. అయితే, గిల్ ఈ ఘనత సాధించడానికి 42 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అందుకే రూట్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. గిల్ 49 సగటుతో మొత్తం 1764 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
3. షాయ్ హోప్ (Shai Hope) – నంబర్ 3 వెస్టిండీస్ బ్యాటర్ షాయ్ హోప్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అతను 50 ఇన్నింగ్స్‌ల్లో 1760 పరుగులు సాధించాడు. అతని బ్యాట్ నుంచి మొత్తం 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు వచ్చాయి.
4. టామ్ లాథమ్ (Tom Latham) – నాలుగో స్థానం న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ అత్యధిక సెంచరీల రేసులో నాలుగో స్థానంలో నిలిచాడు. కేవలం 22 ఇన్నింగ్స్‌ల్లోనే అతను 4 సెంచరీలు సాధించి 792 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు కూడా ఇతని ఖాతాలో ఉన్నాయి.
5. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) – ఐదో స్థానం భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ కూడా 2025లో అద్భుత ప్రదర్శన చేశాడు. 23 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు సాధించిన జైస్వాల్, మొత్తం 916 పరుగులు చేశాడు. ఇతని బ్యాటింగ్ సగటు 41.63గా నమోదైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..