IPL 2024 Records: ఏంది సామీ ఈ ఊచకోత.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..

|

Apr 18, 2024 | 7:15 AM

IPL Records: ఐపీఎల్ 2024 (IPL 2024)లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (KKR vs RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో, KKR వెటరన్ ఆటగాడు సునీల్ నరైన్ ఒక ముఖ్యమైన రికార్డును సృష్టించాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ, వికెట్ తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఇప్పటి వరకు అతని కంటే ముందు ఇద్దరు ఆటగాళ్లు ఈ ఘనత సాధించగా ఇప్పుడు సునీల్ నరైన్ పేరు కూడా చేరింది.

IPL 2024 Records: ఏంది సామీ ఈ ఊచకోత.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..
Ipl 2024 Sunil Naraine
Follow us on

IPL Records: ఐపీఎల్ 2024 (IPL 2024)లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (KKR vs RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో, KKR వెటరన్ ఆటగాడు సునీల్ నరైన్ ఒక ముఖ్యమైన రికార్డును సృష్టించాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ, వికెట్ తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఇప్పటి వరకు అతని కంటే ముందు ఇద్దరు ఆటగాళ్లు ఈ ఘనత సాధించగా ఇప్పుడు సునీల్ నరైన్ పేరు కూడా చేరింది.

ఒకే ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ చేయడమే కాకుండా వికెట్లు కూడా తీసిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. క్రిస్ గేల్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ 2011లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ 107 పరుగులు చేయడంతో పాటు 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీని తర్వాత, ఐపీఎల్ 2013లో, పూణె వారియర్స్ ఇండియాపై గేల్ 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్. అదే మ్యాచ్‌లో గేల్ రెండు వికెట్లు కూడా తీశాడు.

2. షేన్ వాట్సన్..

మరో ఆర్సీబీ ఆటగాడు షేన్ వాట్సన్ కూడా ఈ ఘనత సాధించాడు. IPL 2015లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు, వాట్సన్, KKRపై 104 పరుగులు చేయడంతో పాటు, 38 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. అతను తన పాత జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన IPL 2018లో CSK తరపున ఆడుతున్నప్పుడు ఈ ఫీట్‌ను రెండవసారి సాధించాడు. ఆ మ్యాచ్‌లో 106 పరుగులు చేయడమే కాకుండా 1 వికెట్ తీశాడు.

3. సునీల్ నరైన్..

KKR లెజెండ్ సునీల్ నరైన్ కూడా ఇప్పుడు ఈ జాబితాలో భాగమయ్యాడు. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి ఐపీఎల్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 30 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విధంగా ఆయన పేరిట ఓ అపూర్వ రికార్డు కూడా నమోదైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..