T20 World Cup 2022: నువ్వసలు నాయకుడివేనా.. భారత మాజీ సారథిని ఏకిపారేస్తోన్న ట్రోలర్స్..

|

Sep 13, 2022 | 2:06 PM

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కూడా ట్విట్టర్‌లో స్పందించాడు. ఆ తర్వాత ఆయన సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాడు. వాస్తవానికి 15 మంది సభ్యుల జట్టులో దీపక్ హుడాకు చోటు లభించగా..

T20 World Cup 2022: నువ్వసలు నాయకుడివేనా.. భారత మాజీ సారథిని ఏకిపారేస్తోన్న ట్రోలర్స్..
Indian Cricket Team
Follow us on

India Squad T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌ 2022కు టీమ్‌ఇండియా ఎంపిక చేసిన వెంటనే ఆ జట్టుపై నెట్టింట్లో ఎన్నో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇందులో చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. వారు ఈ జట్టు గురించి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అదే క్రమంలో, భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కూడా ట్విట్టర్‌లో స్పందించాడు. ఆ తర్వాత ఆయన సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాడు. వాస్తవానికి 15 మంది సభ్యుల జట్టులో దీపక్ హుడాకు చోటు లభించగా, శ్రేయాస్ అయ్యర్‌ను స్టాండ్‌బైగా ఉంచారు. ఇదే విషయాన్ని మహ్మద్ అజారుద్దీన్ ట్వీట్ చేసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ట్వీట్‌లో, శ్రేయాస్ అయ్యర్ కంటే దీపక్ హుడాకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల మాజీ సారథి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇది మాత్రమే కాదు, మహ్మద్ షమీని 15 మందిలో ఉంచనందుకు కూడా షాక్ అయినట్లు ప్రకటించాడు. నేను దీపక్ హుడా స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను, హర్షల్ పటేల్ స్థానంలో మహమ్మద్ షమీని చేర్చుకునే వాడిని అంటూ జట్టు ఎంపికపై కామెంట్స్ చేశఆడు. షమీని చివరి 15 మందిలో చేర్చకపోవడంపై స్పందించిన వారిలో అజారుద్దీన్ మొదటివాడు కాదు. ఈ విషయంలో మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా బౌలింగ్ బలహీనమైనదిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ పిచ్‌పై టీమ్ ఇండియా తన ఫాస్ట్ బౌలింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అందరూ భావించారు. కానీ, జట్టులో 4 మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ పునరాగమనం ఖచ్చితంగా జట్టుకు ఉపశమనం కలిగించే వార్త. అయితే మాజీ క్రికెటర్లు షమీని స్టాండ్‌బైలో ఉంచడం గురించి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

అజారుద్దీన్ ట్వీట్ చేస్తూ ట్రోల్ అయ్యాడు..

అజారుద్దీన్ చేసిన ఈ ట్వీట్‌తో, అతను ట్రోలర్ల టార్గెట్‌కి గురయ్యాడు. ఆస్ట్రేలియా పిచ్ బౌన్సీగా ఉందని, బౌన్సర్ శ్రేయాస్ అయ్యర్ బలహీనత ఉందని ఒక యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ కామెంట్ చేస్తూ.. ఈ జట్టులో యూసుఫ్, ఇర్ఫాన్ పఠాన్‌లను కూడా కోల్పోయామని రాసుకొచ్చాడు.